Begin typing your search above and press return to search.

ఆ రాష్ట్రం పేరు మార్చాలని సీఎం ఉబలాటం!

By:  Tupaki Desk   |   4 July 2019 2:30 PM GMT
ఆ రాష్ట్రం పేరు మార్చాలని సీఎం ఉబలాటం!
X
నేతలు పదవి చేతిలో ఉన్నప్పుడు అక్కడి ప్రజల జీవన గతులను మార్చడం సంగతేమిటో కానీ..ఇతర పైపై మెరుగులను మార్చేందుకు మాత్రం ఉబలాట పడుతూ ఉంటారు. ఆ కోవకే వస్తారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. తమ రాష్ట్రం పేరును మార్చాలని ఈమె చాలా కాలంగా పట్టుపడుతూ ఉన్నారు. ఏడెనిమిదేళ్ల నుంచి ఈ ప్రయత్నంలో ఉన్నారామె.

ఈ మేరకు వివిధ దఫాలుగా రాష్ట్రం పేరును మార్చాలని కోరుతూ కేంద్రానికి అసెంబ్లీ తీర్మానాలను పంపించారు మమతా బెనర్జీ. ఎనిమిదేళ్ల కిందట ఒక సారి బెంగాల్ పేరును ‘పశ్చిమ బంగా’గా మార్చాలని అక్కడి అసెంబ్లీ తీర్మానం చేసింది. దాన్ని కేంద్రానికి పంపించారు మమతా బెనర్జీ. అప్పట్లో కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు.

ఆ తర్వాత వివిధ రకాలుగా రాష్ట్రం పేరును మార్చాలని ఆమె చూస్తున్నారు. బెంగాల్, బంగాల్ అంటూ వివిధ ప్రతిపాదనలు పంపారు. పశ్చిమ బెంగాల్ అనేది అర్థం లేని పేరు అనేది వారి వాదన.

అవిభాజ్య భారతదేశంలో అయినా.. తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్ ఉండేవి. పశ్చిమ బెంగాల్ దేశ విభజన అప్పుడు పాకిస్తాన్ లో కలిసింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ గా మరో దేశం అయ్యింది. తూర్పు బెంగాల్ ఉనికే లేదు. కాబట్టి..పశ్చిమ బెంగాల్ అవసరం లేదు అనేది మమత అండ్ కో వాదన. అయితే కేంద్రం మాత్రం మార్పుకు ప్రాధాన్యతను ఇవ్వడం లేదు.

ఈ క్రమంగో తమ రాష్ట్రం పేరును ‘బంగ్లా’గా మార్చాలని కోరుతూ మమత మరో తీర్మానం కాపీని కేంద్రానికి పంపించారు. ఆల్రెడీ బంగ్లాదేశ్ వేరే దేశంగా ఉండా, ఇప్పుడు మళ్లీ దేశంలో బంగ్లా అంటూ ఒక రాష్ట్రం పేరేమిటో అనేది చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం మాత్రం మమతా బెనర్జీ ప్రతిపాదనలకు ప్రాధాన్యతను ఇవ్వడం లేదు!