Begin typing your search above and press return to search.
ఆధార్.. ఓటరు కార్డులపై కేంద్రం సంచలన నిర్ణయం!
By: Tupaki Desk | 17 March 2021 1:15 PM GMTఎన్నికల ప్రక్రియకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఎలక్షన్ మరింత పారద్శకంగా నిర్వహించేందుకు త్వరలో ఆధార్ తో ఓటరు కార్డులను అనుసంధానం చేయనున్నట్టు ప్రకటించింది. బోగస్ ఓట్లను నివారించడంతోపాటు.. ఓటు హక్కుకు భద్రత కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించింది.
ఇప్పటికే.. ఈ విషయమై కేంద్రానికి ఎన్నికల కమిషన్ లేఖ రాసింది. పారదర్శక ఎన్నికల నిర్వహణ కోసం ఆధార్ తో ఓటరు కార్డును లింక్ చేయాలని పేర్కొంది. ఇలా చేయడం వల్ల నకిలీ దరఖాస్తులను నివారించొచ్చని, దేశంలో అందరికీ ఒక్కో ఓటు మాత్రమే ఉంటుందని తెలిపింది.
ఈ నేపథ్యంలో.. ఓటర్ కార్డుకు, ఆధార్ అనుసంధానం చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం లోక్ సభలో తెలిపింది. ఎంపీ దయానిధి మారన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు.