Begin typing your search above and press return to search.

పోల‌వ‌రంపై మోడీ మాట ఇదే.. ఎప్పుడు పూర్త‌వుతుందో చెప్పేశారు!

By:  Tupaki Desk   |   6 Dec 2021 2:05 PM GMT
పోల‌వ‌రంపై మోడీ మాట ఇదే.. ఎప్పుడు పూర్త‌వుతుందో చెప్పేశారు!
X
ఏపీ ప్ర‌జ‌లు ఎంతో ఆశ‌తో ఎదురు చూస్తున్న కీల‌క ప్రాజెక్టు.. పోల‌వ‌రం. రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టంలోనూ దీనిని చేర్చారు. ఇది కేంద్ర ప్ర‌భుత్వ జాతీయ ప్రాజెక్టుగా పేర్కొన్నారు. దీంతో ఈ ప్రాజెక్టుకు అయ్యే ప్ర‌తి రూపాయి కేంద్ర‌మే ఇవ్వాల్సి ఉంది. అయితే.. ఎప్ప‌టిక‌ప్పుడు.. పెరుగుతున్న ఖ‌ర్చు విష‌యంలో మాత్రం కేంద్రం ప‌లాయ‌న‌వాదంతోనే వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వాలు మారినా.. పోల‌వ‌రం మాత్రం పూర్తికావ‌డం లేదు. పైగా రాష్ట్రంలో ఏ ప్ర‌భుత్వం ఉన్న‌ప్ప‌టికీ.. పోల‌వ‌రంపై కేంద్రం పెత్త‌న‌మే ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో పోల‌వ‌రం ఎప్పుడు పూర్త‌వుతుంద‌నే విష‌యం.. బేతాళ క‌థ‌లా మారిపోయింది.

తాజాగా పార్ల‌మెంటు స‌మావేశాల్లో ఈ పోల‌వ‌రం ప్రాజెక్టుపై మోడీ స‌ర్కారు స్పందించింది. నిర్ణీత గడువులోగా పోలవరం పూర్తి కావడం అసాధ్యమని కేంద్రం స్పష్టం చేసింది. పోలవరం పనుల్లో జాప్యం నిజమేనని కేంద్ర జలశక్తి శాఖ తేల్చింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ లిఖితపూర్వక జవాబిచ్చారు. పునరావాసం, పరిహారంలోనూ జాప్యం జరుగుతోందన్న మంత్రి.. సాంకేతిక కారణాలతో పనుల్లో జాప్యం ఏర్ప‌డింద‌ని తెలిపారు. దీనికి నిధుల సమ‌స్య లేద‌ని.. మంత్రి చెప్ప‌డం గ‌మ‌నార్మం.

ఇక‌, వచ్చే ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని తొలుత లక్ష్యంగా పెట్టుకున్నామన్న మంత్రి.. పోలవరం స్పిల్‌వే ఛానల్ 88 శాతం, అప్రోచ్ ఛానల్ ఎర్త్వర్క్ పనులు 73 శాతం, పైలట్ ఛానల్ పనులు 34 శాతం మాత్రమే పూర్తైనట్లు తెలిపారు. ఇక, పోలవరం సవరించిన అంచనాలు రూ.55,548.87 కోట్లకు టీఏసీ ఆమోదించిన మాట నిజమేన్నారు. అయితే.. 2020 మార్చిలో ఆర్.సి.సి ఇచ్చిన నివేదికలో పోలవరం సవరించిన అంచనాలకు రూ.35,950.16 కోట్లకు మాత్రమే అంగీకరించిందని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది.

దీంతో అటు నిధులు త‌గ్గిపోయాయ‌ని అంగీక‌రిస్తూనే ఖ‌ర్చుల‌కు త‌గిన విధంగా నిధుల‌ను స‌వ‌రించేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. అదేస‌మ‌యంలో ఎప్పుడు ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామ‌నే విష‌యాన్ని ఇత‌మిత్థంగా చెప్ప‌క‌పోవ‌డ‌మూ గ‌మ‌నార్హం. సో.. మొత్తానికి పోల‌వ‌రం ప్రాజెక్టుపై ముసురుకున్న నీలి నీడ‌లు ఇప్ప‌ట్లో తొలిగిపోయేలా మాత్రం క‌నిపించ‌డం లేదు.