Begin typing your search above and press return to search.
ఒక్కో కశ్మీరీపై రూ.27 వేలు..అయినా ఫలితం లేదా?
By: Tupaki Desk | 5 Aug 2019 3:45 PM GMTరాజ్యాంగంలోని ఆర్టికల్ 370... కశ్మీరీలకు నిజంగానే వరప్రసాదమనే చెప్పాలి. ఎందుకంటే... దేశంలోని మిగిలిన ప్రాంతాల్లోని ప్రజలు ఒక్కొక్కరికి కేవలం రూ.8 వేలను ఖర్చు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం... ఈ ఆర్టికల్ పుణ్యమా అని ఒక్కో కశ్మీరీపై ఏకంగా రూ.27వేలను వెచ్చిస్తోందట. నిజమా? అంటే... పార్లమెంటు సాక్షిగా కేంద్ర హోం శాఖ మంత్రి హోదాలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ విషయాన్ని విస్పష్టంగా చెప్పిన తర్వాత ఈ మాట నిజం కాదని చెప్పడం సాధ్యం కాదు కదా. అంటే... మనలో ఒక్కొక్కరిపై 8 వేలను వెచ్చిస్తున్న కేంద్రం కశ్మీరీలపై మాత్రం మారు మాట్లాడకుండా 27 వేలను ఖర్చు చేస్తోంది. 370 ఆర్థికల్ కారణంగానే ఈ తరహా పరిస్థితి నెలకొందని అమిత్ షా పార్లమెంటులో చేసిన ప్రసంగం నిజంగానే ఆసక్తికరమేనని చెప్పక తప్పదు.
కశ్మీర్ అంటే ఉగ్రవాదులకు పుట్టినిల్లులా మారిందన్న భావన వ్యక్తమవుతోంది. పర్యాటకంగా సుందర ప్రదేశంగా ఉన్న కశ్మీర్... ఆ రంగంలో ఏమాత్రం ఎదుగూబొదుగూ లేకుండా ఉంటే... కశ్మీర్ అభివృద్ధికి కేంద్రం ఎలాంటి నిధులు ఇవ్వడం లేదేమో అన్న భావన వ్యక్తమవుతుంది. అయితే ఆ భావన తప్పని, దేశంలోని మిగిలిన అన్ని ప్రాంతాలకంటే కూడా ఏకంగా మూడు రెట్ల మేర నిధులను కశ్మీర్ కోసం ఖర్చు పెట్టాల్సి వస్తోందని షా చెప్పడం చూస్తుంటే... మరి అంతేసి నిధులు వెచ్చిస్తున్నా... కశ్మీర్ ఎందుకు అభివృద్ది చెందడం లేదు? ఆ డబ్బంతా కేవలం ఆ రాష్ట్రంలోని మూడు రాజకీయ పార్టీలను నడుపుతున్న మూడు కుటుంబాలకు మాత్రమే చేరుతోందట. అలా కాకుండా కశ్మీర్ కు కేటాయిస్తున్న నిధులు సవ్యంగా ఖర్చు అయితే... కశ్మీర్ ఈపాటికి ఏ లండనో, న్యూయార్క్ మాదిరిగానే అభివృద్ధి చెంది ఉండేదే కదా. మరి అలా జరగకుండా... నిత్యం ఉగ్రవాదుల కాల్పులు, సామాన్య జనం బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్న వైనం చూస్తుంటే... నిజంగానే అమిత్ షా ఆవేదనలో సత్యం ఉందని చెప్పక తప్పదు.
అసలు దేశానికి ఏం ఒరగబెట్టారని కశ్మీరీలకు ఇంతోటి నిధులు వెచ్చించాలి? ఇప్పటికే పాకిస్థాన్ ఉగ్ర మూకలకు ఆశ్రయమిస్తూ అక్కడి కొన్ని గ్రూపులు చేస్తున్న అరాచకాలను ఎన్నాళ్లని ఉగ్గబట్టాలి? ఈ ఉగ్ర దాడుల నుంచి కశ్మీరీ ప్రజలను, దేశాన్ని కాపాడుకునేందుకు ఎంత మేర సైన్యాన్ని అక్కడ నియోగించాలి? అందుకు ఎంత మేర నిధులు వెచ్చించాలి? ఇవి చాలవన్నట్లు ఆర్టికల్ పేరిట ఒక్కో కశ్మీరీకి రూ.27 వేలను కేటాయించాలా?.... ఈ దిశగా సాగిన అమిత్ షా ప్రసంగం దేశ ప్రజల కళ్లు తెరిచిందనే చెప్పాలి. అందుకే... ఏ ఒకటో, అరా పార్టీలు తప్పించి దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని ఒక్కుమ్మడిగా స్వాగతించాయి.