Begin typing your search above and press return to search.

ఆధార్ లింకేజీపై మ‌రో గుడ్ న్యూస్‌

By:  Tupaki Desk   |   13 Dec 2017 11:10 AM GMT
ఆధార్ లింకేజీపై మ‌రో గుడ్ న్యూస్‌
X
ప్ర‌తిదీ ఆధార్‌ తో లింక్ చేయాలంటూ మొబైల్‌ కి మెసేజ్ ల మీద మెసేజ్ లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. తుది గ‌డువు ఈ నెల 31తో పేర్కొంటూ.. ఆ లోపు ఆధార్ లింక్ చేయాల‌ని పేర్కొంటున్నారు. అయితే.. దీనిపై కేంద్రం తాజాగా ఒక తీపిక‌బురు చెప్పింది. బ్యాంకుల‌తో ఆధార్‌ ను లింక్ చేసుకునే డెడ్ లైన్ డిసెంబ‌రు 31 నుంచి వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

మ‌రి.. తుది గ‌డువు ఎప్పుడ‌న్న అంశంపై మాత్రం ఏమీ చెప్ప‌లేదు. త్వ‌ర‌లో ఆ విష‌యాన్ని ప్ర‌క‌టిస్తామ‌ని కేంద్రం పేర్కొంది. తాజాగా తీసుకున్న నిర్ణ‌యంతో డిసెంబ‌రు 31 వ‌ర‌కు ఉన్న తుది గ‌డువును మోడీ స‌ర్కారు ఉప‌సంహ‌రించుకున్న‌ట్లైంది.

అన్ని బ్యాంకు అకౌంట్ల‌కు ఆధార్ తో అనుసంధానం ఈ నెల 31 గ‌డువు మ‌రింత పొడిగింపు వ‌చ్చినా.. మిగిలిన వాటికి సంబంధించి ఆధార్ అనుసంధానం విష‌యంలో మాత్రం ఎలాంటి మార్పు లేద‌ని పేర్కొంది. పాన్ నెంబ‌ర్‌కు ఆధార్ నెంబ‌రుతో లింకేజీకి తుది గ‌డువు వ‌చ్చే ఏడాది మార్చి 31తో ముగుస్తుండ‌గా.. మొబైల్ నెంబ‌ర్ల‌తో ఆధార్ అనుసంధానం చేసేందుకు వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి ఆరుతో ముగియ‌నుంది. ప్ర‌భుత్వం అందించే అన్నిసామాజిక భ‌ద్ర‌త‌.. సంక్షేమ ప‌థ‌కాల‌కు ఆధార్ తో లింక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌తి సేవల విష‌యంలోనూ ఆధార్ తో అనుసంధానం చేయ‌టం ద్వారా సంక్షేమ ప‌థ‌కాల ప్ర‌యోజ‌నం ప‌క్క‌దారి ప‌ట్ట‌కుండా ఉండాల‌ని కేంద్రం భావిస్తోంది. సో.. బ్యాంక్ తో ఆధార్‌ ను అనుసంధానం చేయని వారు అన‌వ‌స‌ర కంగారు ప‌డాల్సిన అవ‌స‌రం లేన‌ట్లే.