Begin typing your search above and press return to search.

రీపోలింగ్‌ అంతా ప్రశాంతం - జీకే ద్వివేది

By:  Tupaki Desk   |   6 May 2019 3:34 PM GMT
రీపోలింగ్‌ అంతా ప్రశాంతం - జీకే ద్వివేది
X
ఏపీలో మూడు జిల్లాల్లో ఐదు స్థానాల్లో నిర్వహించిన రీపోలింగ్‌ ప్రశాంతంగా జరిగిందని అన్నారు ఎన్నికల కమిషనర్‌ గోపాల కృష్ణ ద్వివేది. ఎక్కడా అవాంచనీయ సంఘటనలు జరగలేదని ప్రకటించారు. ఎండలు మండిపోతున్న వేళ ఓటర్లు ఓటు వేసేందుకు వచ్చేలా అన్ని జిల్లాల కలెక్టర్లు ఏర్పాట్లు బాగా చేశారని.. వారందర్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నట్లు ప్రకటించారు ద్వివేది.

రీపోలింగ్ పూర్తైన తర్వాత మీడియాతో మాట్లాడారు గోపాల కృష్ణ ద్వివేది. ఆయన మాట్లాడుతూ.. “ రేపటి నుండి కౌంటింగ్ ప్రక్రియ‌కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. రేపు కౌంటింగ్ సిబ్బందికి అవ‌గాహ‌న‌కు ట్రైనింగ్ ఏర్పాటు చేశాం. కౌంటింగ్ కోసం సిబ్బందిని రెండు ద‌శ‌ల్లో రాండ‌మైజేష‌న్ ద్వారా ఎంపిక‌ చేశాం. ఒక్కొక్క అసెంబ్లీ ఒట్ల లెక్కింపుకు 180 మంది వ‌ర‌కు సిబ్బంది అవ‌స‌రం అవుతారు. మొత్తం కౌంటింగ్ కు 25 వేల మంది సిబ్బంది కావాలి. మే 23 కౌంటింగ్ రోజే ఏ ఉద్యోగి ఏ నియోజ‌క వ‌ర్గం కౌంటింగ్ సెంటర్‌ లో పాల్గోంటారో తెలుస్తుంది” అని అన్నారు ద్వివేది.

ఇక మే 10న చంద్రబాబు కేబినెట్‌ భేటీ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో కూడా దానిపై కూడా స్పందించారు ద్వివేది. “ మే10 మంత్రి వ‌ర్గ స‌మావేశంపై ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి ఏలా ఉందో దాని ప్ర‌కారం అధికారులు న‌డుచుకోవాలి. ఒక వేళ ఏమైనా అనుమానాలుంటే.. సియ‌స్ అధ్వ‌ర్యంలో ఉన్న క‌మిటి దానిని ప‌రిశిలించి సీఈవోకు పంప‌వ‌చ్చు. దానిని నేను కేంద్ర ఎన్నిక‌ల సంఘం అనుమ‌తి కోసం పంపిస్తాను. గ్రూపు 2 ప్రిలిమిన‌రీ ప‌రిక్షల్లో ప్ర‌భుత్వ ప‌ధ‌కాల‌పై అడిగిన ప్ర‌శ్న‌ల‌పై ఫిర్యాదు అందింది. దానిపై నివేదిక కోరాం. నివేదిక రాగానే వెల్లడిస్తా. ఇక కౌంటింగ్‌ రోజు ఏపీలో పూర్తిగా మద్యం అమ్మకాలు బంద్‌” అని చెప్పారు ఏపీ ఎన్నికల కమిషనర్‌ గోపాల కృష్ణ ద్వివేది.