Begin typing your search above and press return to search.
గుడ్ న్యూస్.. దాంతో క్యాన్సర్ కు చెక్
By: Tupaki Desk | 28 May 2022 2:30 AM GMTక్యాన్సర్.. చిన్నా, పెద్దా.. ఆడ, మగ.. అనే తేడా లేకుండా అందర్నీ పట్టి పీడిస్తున్న మహమ్మారి. దీనికి ఎన్ని రకాల మందులు కనిపెట్టినా.. శాశ్వత చికిత్స మాత్రం దొరకడం లేదు. మొదట్లోనే ఈ వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకుంటే ఫలితాలు ఉంటున్నా.. కొన్నేళ్ల తర్వాత మళ్లీ ఈ మహమ్మారి తిరగబెడుతుంది. క్యాన్సర్‌ను పూర్తిగా ఖతం చేసే మందును కనుక్కోవడానికి శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు, ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
ఈ ప్రయత్నంలోనే క్యాన్సర్ మహమ్మారిపై పోరులో భాగంగా శాస్త్రవేత్తలు కొత్త ఆవిష్కరణకు తెర తీశారు. ఈ మహమ్మారిని అంతం చేసే ఓ వైరస్(CF33- hNIS)ను కనిపెట్టారు. అమెరికాలోని ఓ సంస్థ అభివృద్ధి చేసిన వ్యాక్సీనియా అనే ఈ వైరస్‌ను ఇంజిక్షన్ ద్వారా క్యాన్సర్ రోగిలోకి ప్రవేశపెట్టారు. మొదట దీన్ని జంతువులపై ప్రయోగాత్మకంగా పరీక్షించారు. అది విజయవంతం కావడంతో మనుషులపై కూడా ప్రయోగాత్మకంగా ప్రయత్నిస్తున్నారు.
వ్యాక్సీనియా వైరస్.. కొలన్, లంగ్, బ్రెస్ట్, ఒవేరియన్, పాంక్రియాటిక్ క్యాన్సర్ ట్యూమర్లను తగ్గిస్తున్నట్టు ప్రీ క్లినికల్ లేబరేటరీ, జంతువులపై చేసిన ప్రయోగ పరీక్షల్లో వెల్లడైందని.. అమెరికాలో అతిపెద్ద క్యాన్సర్ పరిశోధన, చికిత్స సంస్థ ‘సిటీ ఆఫ్ హోప్’ ప్రకటించింది.
తమ గత పరిశోధనలో ఆంకోలైటిక్ వైరస్‌లు క్యాన్సర్ను అంతం చేసేందుకు వీలుగా వ్యాధి నిరోధక శక్తిని ప్రేరేపిస్తున్నట్లు గుర్తించామని సిటీ ఆఫ్ హోప్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డానెంగ్ లీ తెలిపారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న వారికి వ్యాక్సీనియా మంచి ఫలితమిస్తుందని వెల్లడించారు.
ప్రయోగాత్మక చికిత్సలో భాగంగా వ్యాక్సీనియా ఇంజిక్షన్‌ను తక్కువ మోతాదులో నేరుగా క్యాన్సర్ టూమర్‌కు లేదా నరాలకు ఇవ్వనున్నట్లు సిటీ ఆఫ్ హోప్ వెల్లడించింది. వ్యాక్సీనియా ఆంకోలైటిక్ వైరస్ అని.. ఇది శరీరంలోని క్యాన్సర్ కణాలను గుర్తించి అంతం చేసే విధంగా జన్యుపరంగా మార్పు చేసిన వైరస్ అని తెలిపింది.
క్యాన్సర్ కణాల్లో వ్యాక్సీనియాను ఇంజెక్ట్ చేయగానే.. అది కొత్త వైరస్ కణాలను తయారు చేసుకుంటుందని.. ఈ కణాలు యాంటీజెన్‌గా పనిచేసి వ్యాధి నిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తాయని.. అప్పుడు వ్యాధి నిరోధక వ్యవస్థ క్యాన్సర్ కణాలపై దాడి చేసి వాటిని అంతం చేస్తోందని సిటీ ఆఫ్ హోప్ వైద్యులు తెలిపారు. ఇది కనుక విజయవంతమై అందుబాటులోకి వస్తే క్యాన్సర్ మహమ్మారి బలయ్యే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతుందని వైద్య నిపుణులు భావిస్తున్నారు.