Begin typing your search above and press return to search.

టీ స‌చివాల‌యం బూతు బంగ్లా అయింద‌ట‌?

By:  Tupaki Desk   |   13 Dec 2016 3:13 PM GMT
టీ స‌చివాల‌యం బూతు బంగ్లా అయింద‌ట‌?
X
బంగారు తెలంగాణ సాధ‌న కోసం ముందుకు సాగుతున్నామ‌ని చెప్తున్న తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సార‌థ్యంలోని స‌ర్కారులో అసాంఘిక కార్య‌క‌లాపాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయ‌ని వార్త‌లు వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌భుత్వ ప‌రిపాల‌న‌కు గుండె కాయ అయిన స‌చివాల‌యంలో ఉండే ప‌లువురు సీనియ‌ర్ ఐఏఎస్ అధికారులు ఆడ‌వాళ్ల వ‌ల‌లో చిక్కుకొని అడ్డ‌గోలు ప‌నుల‌కు పాల్ప‌డుతున్నార‌ని ప్ర‌ముఖ పత్రిక ఒక‌టి వార్తా క‌థ‌నం రాసింది. అంతే కాకుండా త‌మ‌కు మందు - విందు - పొందు ద‌క్కితే అడ్డ‌గోలు ఫైల్లు కూడా ప‌రిష్కారం అయిపోతున్నాయ‌ని, న్యాయంగా కావాల్సిన ప‌నులు సైతం మూల‌న ప‌డిపోతున్నాయ‌ని పేర్కొంది. దాదాపు 12 మంది అత్యున్న‌త ఐఏఎస్ అధికారులు ఇందులో పాలుపంచుకుంటున్నార‌ని ప్ర‌స్తావించింది.

ఇదిలాఉండ‌గా రాష్ట్ర సచివాలయంలో మంత్రుల, అధికారుల పేషీలో జరుగుతున్న గోల్ మాల్- ఫైల్స్ కదులుతున్న తీరుతెన్నులు- అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు పత్రికలలో వస్తున్న విషయాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సచివాలయం సాక్షిగా కొంతమంది అధికారులు - మంత్రుల పేషీల కార్యదర్శులు - అదృష్టశక్తులు కలిసి ఫైల్స్ తారుమారు - అసాంఘిక కార్యకలాపాలు - తమకు అనుకూలంగా బదీలీలు చేయించడం - వారికి సంబంధించిన పనులు చేసిపెట్టడానికి స్టార్ హోటల్ ల‌లో విందులు - వినోదాలతో ఉన్నతాధికారులను లోబర్చుకొని బాజాప్త‌గా తమ పనులు చక్కబెట్టుకుంటున్నారని వార్తలు షికారులు చేస్తున్నాయని చాడ ఆరోపించారు. సచివాలయంలోని "ఎ-బ్లాక్ నుండి డి-బ్లాక్" దాక ఈ తంతు జరుగుతున్నాయని ఆయ‌న తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుందని ముఖ్యమంత్రి - మంత్రులు - అధికారులు నిత్యం ప్రకటనలు చేస్తున్నారు కానీ దీనికి విరుద్దంగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం ప్రభుత్వ ప్రతిష్టను దిగదార్చుతోంద‌ని చాడ వెంక‌ట‌రెడ్డి తెలిపారు. సచివాలయంలో సామాన్యుడు పోవాలంటే అనేక రకాలైన షరతులతో గంటల తరబడి వేచి వుంటే కూడా వెళ్ళే పరిస్థితి ఉండ‌గా అక్రమార్కులు- పైరవీకారులు-సచివాలయ నిబంధనలు ఖాతరు చేయకుండా ఎప్పదైన తన మంది, మార్బలంతో సచివాలయంలోకి ప్రవేశించి ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని చాడ మండిప‌డ్డారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. దాని కొనసాగింపుగానే తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా జరుగుతున్నాయని, ఈ విషయాలపై ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని సమగ్రమైన విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/