Begin typing your search above and press return to search.

పొత్తులకై పరుగులు !

By:  Tupaki Desk   |   10 Sep 2018 10:02 AM GMT
పొత్తులకై పరుగులు !
X
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలన్నీ పొత్తులకు తెరతీసాయి. రాష్ట్రంలో పార్టీలన్నీ కూడ రాబోయే రోజులలో ఎవరితో కలసి ప్రయాణం చేయాలా అని సతమతమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు - అపధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మినహా - తమతో కలసి వచ్చే పార్టీలన్నింటిని ఒక తాటిపై తీసుకు రావాలని చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితికి హవా తగ్గిందన్న వాదన వినిపిస్తుండడంతో తెరాస నాయకులు తమ సర్వ శక్తులు ధారపోసైన సరే అధికారం చేపట్టాలని వారు భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి - తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారాచంద్రబాబు నాయుడు కూడా పొత్తుల కోసం పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు తెలంగాణలో పొత్తులపై తమ పార్టీ నాయకులకు సంకేతాలు ఇచ్చారు. తమతో కలిసి వచ్చే పార్టీలతో చేయి కలపేందుకు తాము సిద్దంమని నర్మగర్భంగా చెప్పారు. దీంతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.ఇప్పటికే తెలంగాణలోని తెలుగుదేశం పార్టీ నాయకులు సీపీఐ నేత చాడ వెంకట రెడ్డితో చర్చలు జరిపారు. తెలంగాణ జన సమితి నాయకుడు ప్రొఫెసర్ కోదండ రామ్‌ కూడా త్వరలో వీరితో భేటి కానున్నారని వినికిడి. రానున్న మూడు - నాలుగు రోజులలో కాంగ్రెస్ పార్టితో కూడా వీరంతా చర్చించే అవకాశాలు ఉన్నాయి. అతి త్వరలో తెలంగాణలోని ప్రతిపక్షాలన్నీ కూడా పొత్తులపై ఒక స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది. పార్టీలన్నీ కూడా "మహాకూటమి" పేరిట ఎన్నికల బరిలోకి దిగాలని సీపీఐ నేత చాడ వెంకట రెడ్డి - తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ తెలిపారు. కేసీఆర్‌ ను గద్దె దించడమే లక్ష్యంగా తామంతా పనిచేయాలని, సీట్లు - టిక్కట్ల విషయంలో పట్టూ విడుపూ ఉండాలని వారు సూచించారు. అయితే త్వరలో కాంగ్రెస్ - తెలుగుదేశం పార్టీలు మరోసారి విస్త్రుతంగా చర్చించనున్నాయి. ఈ చర్చలో ప్రధానంగా పోటి చేయాల్సిన స్దానాలు - తమతో కలసి వచ్చే పార్టీల డిమాండ్లపై స్పష్టత వచ్చాక పొత్తులపై పూర్తి స్పష్టత వస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. త్వరలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంథీని కలుస్తామని స్థానిక కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. రాహుల్ గాంధీని కలసేనాటికి పొత్తులపై ఒక స్పష్టత వస్తుందని వారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పొత్తులపై రాష్ట్రంలోని నేతలు చర్చించుకుని వ్యూహాలు రూపోందినంచుకోవాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయడు సూచించారు. అయితే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చరిష్మా తగ్గలేదని - రాబోయే ఎన్నికలలో 40 సీట్లు ఖచ్చితంగా తమవే అని తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నాయకులు అంటున్నారు.