Begin typing your search above and press return to search.

కేటీఆర్‌ కు బోన‌స్ ఇస్తే షాక్ మిగిలింది

By:  Tupaki Desk   |   26 Oct 2016 1:36 PM GMT
కేటీఆర్‌ కు బోన‌స్ ఇస్తే షాక్ మిగిలింది
X
గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పోరేష‌న్‌ లో రోడ్ల ప‌రిస్థితిపై విప‌క్షాలు విరుచుకుప‌డుతున్నాయి. తాజాగా సీపీఐ ఆధ్వ‌ర్యంలో జీహెచ్ ఎంసీలో జరిగిన కోట్లాది రూపాయల అవినీతి అక్రమాలపై న్యాయ విచారణ జరిపించాలని, దోషులను శిక్షించాలని - నగరంలో రోడ్ల మరమ్మత్తులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ చలో జీహెచ్ ఎంసీ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టి పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ - ఆయ‌న త‌న‌యుడు కేటీఆర్‌ పై సెటైర్ల‌తో కూడిన విమ‌ర్శ‌లు చేశారు.

గ్రేటర్ ఎన్నికల నేప‌థ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుమారుడికి అదనంగా మున్సిపల్ శాఖను అప్పగించ‌డంతో సీఎం కుమారుడు మంత్రి కాబ‌ట్టి అంతా బాగుంటుంద‌ని ఆశిస్తే...ఆద్వానంగా త‌యారైంద‌ని చాడ వెంక‌ట‌రెడ్డి మండిప‌డ్డారు. గ్రేట‌ర్ ఎన్నికలకు ముందు హైద‌రాబాద్‌ ను విశ్వనగరం - సుందర నగరంగా 100 రోజుల్లో తీర్చిదిద్దుతామన్న కేటీఆర్ మాటలు నీటి మూటలు గానే మిగిలాయన్నారు. నగరంలో రోడ్ల దుస్తుతి దారుణంగా తయారైందని, గుంతలమయమైన రోడ్లపై ప్రమాదాల భారిన పడి ప్రజలు మరణిస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినటైనా లేదన్నారు. కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి అయ్యాక హైదరాబాద్ నగర దుస్థితి మరింత దయనీయంగా తయారైందని మండిప‌డ్డారు. కేటీఆర్‌ కు మంత్రి ప‌ద‌వి బోన‌స్‌ గా ద‌క్కితే న‌గర ప్ర‌జ‌ల‌కు న‌డుం నొప్పులు ఫ్రీగా ఇస్తూ బోన‌స్‌లు అందిస్తున్నార‌ని చాడ ఎద్దేవా చేశారు. రోడ్ల మరమ్మత్తుల కోసం కేటాయించిన నిధుల‌లో ఇటీవల గ్రేట‌ర్‌ లో కోట్లాది రూపాయల అవినీతి చోటు చేసుకున్నా ఇంత వరకు దోషులను శిక్షించకపోవడం దారుణమన్నారు. వెంటనే అవినీతి అధికారులను అరెస్తు చేయాలని చాడ వెంక‌ట‌రెడ్డి డిమాండ్ చేశారు.

సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్ పాషా మాట్లాడుతూ విశ్వనగరంలో ప్రజలు రోడ్లపై తిరగాలంటే నరకం చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో రోడ్ల దుస్థితి దారుణంగా తయారైందని, వెంటనే రోడ్ల నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. నగరంలోని అనేక మురికివాడల్లో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించడంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పూర్తిగా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ ను పాలించిన నిజాం పాలనను తలపించేలా కేసీఆర్ పాలన కొనసాగతుందన్నారు. గ్రేటర్ ఎన్నికలకు ముందు ఇచ్చిన అనేక వాగ్దానాలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. నగరంలో రోడ్లు నరకాన్ని చూపిస్తున్నా ప్రభుత్వానికి - మంత్రులకు చీమకుట్టినట్లైనా లేదన్నారు. జీహెచ్ ఎంసీలో ఇటీవల జరిగిన అవినీతి - అవకతవకలపై న్యాయ విచారణ జరిపించి రోడ్ల మాఫీయాను వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/