Begin typing your search above and press return to search.
అనంతపురం ఫైర్ బ్రాండ్ పులివెందులకు టీడీపీ ఇన్ చార్జా?
By: Tupaki Desk | 17 Aug 2020 5:31 PM GMTపులివెందుల అంటేనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి ఇలాకా అని తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరినీ అడిగినా చెబుతారు. వైఎస్ ఫ్యామిలీకి పులివెందుల పెట్టని కోటలా ఉంటుంది. ప్రతీసారి ప్రజలు ఆ కుటుంబాన్నే గెలిపిస్తుంటారు.
అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి టైంలో పులివెందులలో టీడీపీ అంతో ఇంతో ఉనికిని చాటుకునేది. జగన్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత టీడీపీకి పులివెందులలో అడ్రస్ లేకుండా చేశాడని అక్కడి టీడీపీ సానుభూతిపరులు వాపోతున్నారట..
అయితే చంద్రబాబు మాత్రం ఖాళీ లేకుండా జూమ్ లో బిజీ అవుతున్నాడు. అందులో బాగానే కడప నాయకులతో జూమ్ లో మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలోనే ఖాళీగా ఉన్న పులివెందులకు ఇన్ చార్జిగా జేసీ ప్రభాకర్ రెడ్డిని పెడితే బాగుంటుందని నేతలంతా చంద్రబాబుకు సూచించారట... తాడిపత్రి పక్కనే పులివెందుల ఉందని.. కాబట్టి కొంచెం దగ్గరి సంబంధాలు ఉన్నాయని.. అసలే ఇప్పుడు జగన్ మీద జేసీ ఫైర్ అవుతున్నాడు కాబట్టి.. పులివెందులకు జేసీని పెడితే కరెక్ట్ గా ఉంటుందని కడప నాయకుల సలహాలు ఇచ్చారట..
ప్రస్తుతం పులివెందులలో పార్టీ జెండా మోసే నాయకుడు లేడు కాబట్టి ఈ మంచి ఆలోచన చంద్రబాబుకు చెప్పారంట.. జగన్ అంటే పడని ఆయన శత్రువును పులివెందుల రాజకీయాల్లో ఆయన ప్రత్యర్థిగా దింపితే ఎలా ఉంటుందని బాబు ప్రస్తుతం ఆలోచిస్తున్నాడట... మరి జగన్ పై జేసీని చంద్రబాబు దింపుతారా లేదా అన్నది వేచిచూడాలి.