Begin typing your search above and press return to search.
కొడాలి నాని మీద ఎన్టీఆర్ మనవడు పోటీ!?
By: Tupaki Desk | 7 Dec 2022 11:30 AM GMTవైసీపీ నాయకుడు, పొలిటికల్ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి కొడాలి నానికి ఈ సారి దిమ్మతిరగడం ఖాయమా? ఇప్పటి వరకు వరుస సాధించి దూసుకుపోతున్న ఆయనకు టీడీపీ అధినేత చంద్రబాబు తనదైన శైలిలో చెక్ పెడుతున్నారా? వచ్చే ఎన్నికల్లో గుడివాడలో టీడీపీ సుడి తిరుగుతుందా? అంటే.. ఔననే అంటున్నా రు పరిశీలకులు. రాజకీయాల్లో మార్పు సహజం అన్నట్టుగా ఇప్పుడు.. గుడివాడలోనూ రాజకీయ పవనాలు మారుతున్నాయి.
నాని దూకుడు, విమర్శలు, బూతులు భరించలేమని అక్కడి ప్రజలే ఇటీవల ఓ వెబ్ చానెల్ నిర్వహించిన సర్వేలో చెప్పుకొచ్చారు. ఇదిలావుంటే, తనను ఎదిరించే నాయకుడు, తనపై గెలిచే నాయకుడు లేనే లేడని తరచుగా నాని చెబుతుంటారు. అయితే, ఆయన ధీమాను కట్టడి చేస్తూ.. ఇప్పుడు కీలక యువ నేత రంగంలోకి దిగుతున్నట్టు సమాచారం.
దివంగత మాజీ సీఎం, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన యువకుడు, ఎన్టీఆర్ మనవడు చైతన్య కృష్ణ. త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు టీడీపీ వర్గాలు చెబుతు న్నాయి. ముఖ్యంగా గుడివాడ నుంచి పోటీకి దిగే అవకాశం ఉందని అంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పైనా, ఆయన ఫ్యామిలీ పైనా తరచుగా నోరు పారేసుకునే కొడాలి కి చెక్ పెట్టేందుకు తాను ఉన్నానని చైతన్య ముందుకు వచ్చినట్టు పార్టీలో చర్చ సాగుతోంది. ఇప్పటికే ఆయన చంద్రబాబు తో భేటీ కూడా అయ్యారని అంటున్నారు.
ఈ సందర్భంగా తన మనసులో మాటను చంద్రబాబుకు విన్నవించారని.. పార్టీ అవకాశం ఇస్తే.. గుడివాడ నుంచి బరిలో దిగి తన సత్తా చూపిస్తానని కూడా చెప్పినట్టు సమాచారం. చైతన్య కృష్ణ ఆలోచనకు చంద్రబాబు కూడా మద్దతు ప్రకటించారని, అయితే, గుడివాడలో తరచుగా పర్యటించాలని, అక్కడి పరిస్థితిని అధ్యయనం చేయాలని, పార్ టీనేతలతో కలివిడిగా ఉండాలని చంద్రబాబు సూచించినట్టు తెలిసింది.
అంతేకాదు, సెంటిమెంటుతో ఇక్కడి వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేయాలని కూడా చంద్రబాబు తన దైన శైలిలో చైతన్య కృష్ణకు సూచించారని అంటున్నారు.
గతంలో అన్నగారు ఎన్టీఆర్ కూడా గుడివాడ నుంచి పోటీ చేయడం, అన్నగారు పుట్టిన ప్రాంతం(జిల్లా) కావడం.. నందమూరి అభిమానులు కోకొల్లలుగా ఉండడం వంటి నేపథ్యంలో ఇక్కడ అదే కుటుంబానికి చెందిన అన్నగారి మనవడు కనుక పోటీకి దిగితే గుడివాడ నాని చెక్ పెట్టతథ్యమేనని పార్టీ నేతలు అంటున్నారు. అయితే, సెంటిమెంటు వర్కవుట్ అవుతుందా? అనేది కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు.