Begin typing your search above and press return to search.
ఆంధ్రా ఎంపీలకు అంత సీన్ ఉందా?
By: Tupaki Desk | 20 May 2016 3:16 PM GMTఏదైనా రాష్ట్రానికి కేంద్రం కారణంగా ఏదైనా అన్యాయం జరుగుతుందంటే చాలు.. ఆ రాష్ట్ర ఎంపీలు నిప్పులు చిమ్ముతారు. చెలరేగిపోతారు. అధికారంలో ఉన్నది స్వపక్షమైనా.. మిత్రపక్షమైనా పట్టించుకోరు. ‘‘మీరేమైనా చేసుకోండి.. మాకనవసరం.. మా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తీసేలా నిర్ణయం తీసుకుంటే మాత్రం సహించేది లేదు’’ అని తెగేసి చెబుతారు. కానీ.. ఇందుకు మినహాయింపు ఏదైనా రాష్ట్రం ఉందంటే.. అది ఆంధ్రప్రదేశ్ అని చెప్పక తప్పదు. రాష్ట్ర విభజన సమయంలో.. విడిపోవటం అనివార్యమైన విషయం తెలిసిన తర్వాత కూడా.. ఏపీకి ఏం అవసరమవుతాయి? భవిష్యత్తు అవసరాలు ఎలా ఉంటాయన్న విషయాన్ని వదిలేయటం సీమాంధ్ర ఎంపీలకు మాత్రమే సాధ్యమవుతుంది.
విభజన సమయంలోనే కాదు.. విభజన తర్వాత.. ఏపీ ప్రయోజనాల మీద గట్టిగా నిలదీయటం కనిపించదు. ఏదో మాట్లాడామంటే మాట్లాడమన్నట్లుగానే ఉంటుందే తప్పించి.. పార్టీలకు అతీతంగా ఒకే గళంగా మారటం కనిపించదు. తమిళనాడుకు ఏదైనా నష్టం జరుగుతుందంటే.. పార్టీలకు అతీతంగా తమిళ ఎంపీలు ఒక్కటై పోరాడతారు. కానీ.. ఏపీకి కేంద్రం ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా గురించి ఏదో ఒకరిద్దరు ఎంపీలు మాట్లాడటమే తప్పించి.. గట్టిగా నిలదీసింది కనిపించదు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్రం హ్యాండ్ ఇవ్వటం ఖాయమన్న విషయం తేలిన నేపథ్యంలో.. తమ హక్కుల సాధన కోసం.. తమకు జరిగిన అన్యాయం మీద ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన ఏపీ ఎంపీలు.. ఎలా ఉంటున్నారన్న విషయం రోజూ చూస్తున్నదే. ఇదిలా ఉంటే.. తాజాగా.. ఆంధ్రా మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ ఆసక్తికర ప్రతిపాదన ఒకటి తెర మీదకు తీసుకొచ్చారు.
ఏపీ ఎంపీలకు తమ సొంత రాష్ట్రమ్మీద ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. ఢిల్లీలోని ప్రధాని అధికార నివాసం ముందు ధర్నా చేయాలని డిమాండ్ చేశారు. విభజన చట్టాల్లోని హామీల్ని నెరవేర్చేలా అఖిలపక్షాన్ని వేయాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. ప్రధాని ఇంటి ముందుకెళ్లి ధర్నా చేయమంటే.. జేసీ లాంటోళ్లో.. రాయపాటి పెద్దమనషుల స్పందన ఎలా ఉంటుందంటే.. తాము కానీ ప్రధాని ఇంటి ముందు ధర్నా చేస్తే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందన్న గ్యారెంటీ ఇస్తే.. ధర్నా ఏంటి.. ఏకంగా రాజీనామా చేస్తామంటారు. అంతేకానీ.. నిలదీద్దామన్న మాట మాత్రం చెప్పరు. ఇదే తరహాలో కేసీఆర్ కానీ ఆలోచించి ఉంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమయ్యేదా? అన్న ప్రశ్నను వేసుకోరు. ఏదో ఒక మాట చెప్పటమే తప్పించి.. చలసాని లాంటోళ్లు ఉద్యమ స్ఫూర్తితో ఇచ్చే పిలుపులకు స్పందిస్తారా? అంత సీన్ ఏపీ ఎంపీలకు ఉందా..?