Begin typing your search above and press return to search.
హోదా పోరును చీల్చకు..వైసీపీ పోరాటానికి అడ్డుపడకు
By: Tupaki Desk | 5 April 2018 1:12 PM GMTజనసేన పార్టీ అధినేత - సినీనటుడు పవన్ కళ్యాణ్ తీరుపై ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం ఒక్కతాటిపైకి వచ్చి పోరాటం చేయాల్సిన సమయంలో ఆ ఐక్యతకు భంగం కలిగించేలా పవన్ వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు ప్రకటన చేశారు. ఈనెల ఆరో తేదీన ఏపీకి న్యాయం చేయాలని జనసేన సారథ్యంలో ఆందోళనలను పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిలుపుపై హోదా సాధన సమితి నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ప్రత్యేకహోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ వామపక్షాలు - జనసేన చేపట్టే పాదయాత్రకు ప్రత్యేకహోదా సాధన సమితి మద్దతు లేదని స్పష్టం చేశారు. పాదయాత్రలో పాల్గొనమని ప్రత్యేకహోదా సాదన సమితిని జనసేన ఆహ్వానించలేదని తేల్చిచెప్పారు. ఢిల్లీలో వైఎస్ ఆర్ సీపీ ఎంపీలు ఆమరణ దీక్షలు చేస్తుంటే..రాష్ట్రంలో పాదయాత్రల పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు మంచివి కావని చలసాని శ్రీనివాస్ తెలిపారు. ప్రత్యేకహోదా ఉద్యమాన్ని ఇవి నీరుగారుస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేకహోదా సాధన సమితి నేతలు ఢిల్లీకి వెళుతున్నారని, పదవులకు రాజీనామా చేసి, ఆమరణదీక్ష చేసే వైసిపి ఎంపీలకు సంఘీభావం ప్రకటిస్తామని ఆయన ప్రకటించారు.
జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేకహోదా కోసం వేరు కుంపట్లు సరికాదని వారు అభిప్రాయపడ్డారు. వైఎస్ఆర్‌సీపి ఎంపీలు రాజీనామాలు కీలక పరిణామమని తెలిపారు. తెలుగుదేశం ఎంపీలు కూడా రాజీనామాలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంపీలు ఆమరణదీక్షలు చేస్తే కేంద్రం దిగివస్తుందని తెలిపారు. ఎంపీల రాజీనామా సందర్భంలో జనసేన పాదయాత్ర చేపట్టడం మంచిది కాదని అన్నారు. ప్రత్యేకహోదా ఉద్యమాన్ని చీల్చు ప్రయత్నాలకు పావులు కావద్దని, ఐక్యంగా ఉద్యమించేందుకు అందరూ కలిసి రావాలని కోరారు.