Begin typing your search above and press return to search.

మాటల హీట్ మామూలుగా లేదుగా? పీక్స్ కు చల్లా - కొండా రగడ!

By:  Tupaki Desk   |   24 Jan 2022 5:30 AM GMT
మాటల హీట్ మామూలుగా లేదుగా? పీక్స్ కు చల్లా - కొండా రగడ!
X
‘‘ధర్మారెడ్డి.. పులిని తట్టి లేపావ్.. ఇక కాస్కో. నీ పాపం పండింది. డుకున్న సింహాన్ని లేపారు. కొండాను ఢీ కొట్టడమంటే కొండను ఢీకొట్టినట్లే’’ - కొండా సురేఖ

‘‘కొండా దంపతులనే తరిమి కొట్టాను.. విగ్రహం ఓ లెక్కా. నేను ఆగ్రహిస్తే దాని అడ్రస్‌ ఉండదు. కొండా దంపతులు నిద్రపోతున్న సింహాలు కాదు. లేవలేని స్థితిలో ఉన్నారు. ప్రజలు వారి ముఖం చూడడానికి కూడా ఇష్టపడడంలేదు’’ - చల్లా ధర్మారెడ్డి

అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామాలు రాజకీయ రగడను పీక్స్ కు తీసుకెళ్లటమే కాదు.. రానున్న రోజుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా.. రాజకీయ ప్రతీకారాలకు కేరాఫ్ అడ్రస్ గా మారేలా చేయనున్నాయా? అన్న సందేహాన్ని కలిగేలా చేశాయి. గులాబీ దండు తొందరపాటు తాజా టెన్షన్ కు కారణమని చెబుతున్నారు. అయితే.. తమదేమాత్రం తప్పు లేదని.. అసలీ లొల్లి మొత్తానికి కొండా ఫ్యామిలీ చేసిన అతేనని మండి పడుతున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.. సీనియర్ రాజకీయ నేతలు కొండా దంపతుల మధ్య మాటలయుద్ధం పీక్స్ కు చేరుకున్నాయి.

అసలీ వివాదం ఎక్కడ మొదలైందన్న విషయంలోకి వెళితే..

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆత్మకూరు మండలం అగ్రహం పాడ్ లో కొండా మురళి తల్లిదండ్రుల సమాధుల్నిటీఆర్ఎస్ శ్రేణులు ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. దీంతో.. తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీఆర్ఎస్ కార్యకర్తలు ఈ సమాధుల్ని ధ్వంసం చేయటానికి ప్రయత్నిస్తే కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో.. తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సమాచారాన్ని అందుకున్న కొండా సురేఖ హుటాహుటిన సమాధుల వద్దకు చేరుకున్నారు. అత్తమామల సమాధులకు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదంతా చల్లా ధర్మారెడ్డి ఆదేశాలతోనే టీఆర్ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేశారన్న ఆమె.. ‘‘మా అత్తమామల సమాధుల్ని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదేశాలతోనే ధ్వంసం చేశారు. పడుకున్న సింహాన్ని నిద్ర లేపారు. ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఆదేశాలతో స్థూపాన్ని కూల్చారు. ఇకపై కొండా ఫ్యామిలీ అంటే ఏమిటో చల్లాకు చూపిస్తాం’’ అని తీవ్ర స్వరంతో హెచ్చరించారు.

అంతేకాదు.. ‘‘ధర్మారెడ్డి.. పులిని తట్టి లేపావు. ఇక కాస్కో. ఏం చేస్తావో చేసుకో. కానీ నీ పాపం పండింది. ప్రజలు తిరగబడి తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే వున్నాయి. గతంలో రూ.3 కోట్ల కాంట్రాక్ట్ కోసం మా వద్దకు వచ్చి చేతులు కట్టుకుని నిల్చున్న సంగతి మరిచావా? గుర్తుపెట్టుకో. కొండాను ఢీ కొట్టడమంటే కొండను ఢీకొట్టినట్లే. మేం ఇక్కడ లేకుంటేనే నువ్వు ఎమ్మెల్యే అయ్యావని గుర్తుంచుకో'' అంటూ కొండా సురేఖ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖపై ధర్మారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కొత్త ఉద్రిక్తతలకు తెర తీశాయి. ‘‘కొండా దంపతులనే తరిమి కొట్టాను.. విగ్రహం ఓ లెక్కా? నాకు కోపం వస్తే కొండా దంపతులు అడ్రస్ లేకుండా పోతారు. ప్రజలు కొండా దంపతుల్ని ఎప్పుడో తరిమి కొట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయంలోనే అగ్రహంపాడ్ అభివృద్ధి జరిగింది. ప్రజల ఆగ్రహానికి గురై కొండా దంపతులు అడ్రస్ లేకుండా పోయారు. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు’’ అని నిప్పులు చెరిగారు.

అంతేకాదు.. సమాధుల ఏర్పాటును ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. ‘‘వేయి తప్పులు చేసి నాశనానికి గురైన కొండా దంపతులు.. ప్రజల చేతిలో ఇంకా నాశనం అవుతారు. సమ్మక్క- సారలమ్మ జన్మస్థానమైన ఆత్మకూరు మండలం ఆగ్రంపహాడ్‌ జాతరలో కొండా మురళి తల్లిదండ్రుల విగ్రహాలు పెట్టడం ఏంటి? నేను ఆగ్రహిస్తే దాని అడ్రస్‌ ఉండదు’ అన్న ఆయన మాటలు సంచలనంగా మారాయి. కొండా సురేఖను ఉద్దేశించి.. ఆయన చేసిన ఏకవచన ప్రయోగం కొండా వర్గీయులకు మంట పుట్టేలా చేస్తున్నాయి. ఏమైనా.. చల్లారెడ్డి వ్యాఖ్యలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్త తరహా రాజకీయ రగడకు తెర తీశాయన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. పోలీసులకు రానున్న రోజులు పరీక్షగా మారటం ఖాయమన్న అబిప్రాయం వ్యక్తమవుతోంది.