Begin typing your search above and press return to search.
హిజాబ్ వివాదంపై హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్
By: Tupaki Desk | 15 March 2022 3:30 PM GMTనెలరోజులకు పైగా నలిగిన హిజాబ్ వివాదానికి కర్ణాటక హైకోర్టు తీర్పుతో తెరపడుతుందని అందరూ అనుకున్నారు. కానీ అక్కడితో ఆగలేదు. తీర్పు వ్యతిరేకంగా రావడంతో మైనార్టీ విద్యార్థులు భగ్గుమన్నారు. సుప్రీంకోర్టుకు ఎక్కారు.
సరిగ్గా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు హిజాబ్ అనుకూల, వ్యతిరేక ఆందోళనలతో కర్ణాటక రాష్ట్రంతోపాటు యావత్ దేశం అట్టుడికింది. ఎన్నికలకు ముందు హిజాబ్ వివాదం యావత్ దేశంలో రాజకీయ వేడిని రగిల్చింది. అయితే కర్ణాటక హైకోర్టు తాజాగా తీర్పునిచ్చింది.
విద్యాసంస్థల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించరాదనే వివాదంపై తాజాగా తుది తీర్పునిచ్చింది. హిజాబ్ నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటీషన్లను హైకోర్టు కొట్టివేసింది. విద్యాసంస్థల్లో మతపరమైన ఆచారాలను పాటించడం తప్పనిసరి కాదని హైకోర్టు స్పష్టం చేసింది.
విద్యాసంస్థల్లో సంప్రదాయ వస్త్రధారణపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని హైకోర్టు సమర్థించింది. ఈ మేరకు ఈ అంశంపై దాఖలైన పిటీషన్లను హైకోర్టు కొట్టివేసింది. విద్యాసంస్థల ప్రొటోకాల్ ను విద్యార్థులంతా తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.
కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో ఇప్పుడు ఈ వ్యవహారం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు చేరుకుంది. కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది. దీంతో ఈ వివాదాన్ని వైరివర్గం వదిలిపెట్టేది లేదని స్పష్టమవుతోంది.
విద్యాసంస్థల్లో హిజాబ్ వస్త్రధారణపై గతనెల కర్ణాటకలో పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కర్ణాటకతోపాటు దేశమంతా ఇది విస్తరించింది. హిజాబ్ కు మద్దతుగా.. వ్యతిరేకంగా నిరసనలు కొనసాగాయి. మరోవైపు హిజాబ్ వస్త్రధారణకు అనుమతి ఇవ్వాలంటూ ఉడుపి, కుందాపుర ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు హైకోర్టును ఆశ్రయించారు.
తొలుత జస్టిస్ కృష్ణదీక్షిత్ తో ఏర్పాటైన ఏకసభ్య ధర్మాసనం విచారించింది. ఆ తర్వాత ఈ విచారణను త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేశారు. దీనిపై ఫిబ్రవరి 10న హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ ప్రారంభించింది 15 రోజుల పాటు వాదనలు వినింది. ఇదే సమయంలో సంప్రదాయ వస్త్రధారణను నిషేధిస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.
ఫిబ్రవరి 25న తీర్పును రిజర్వ్ లో పెట్టిన ఉన్నత న్యాయస్థానం నేడు తుది తీర్పును వెలువరించింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలోనే నేడు బెంగళూరు సహా పలు ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు జారీ చేశారు. నేటి నుంచి మార్చి 19 వరకూ ఈ ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ఉడుపిలో స్కూళ్లు, పాఠశాలలకు నేడు సెలవు ప్రకటించారు.