Begin typing your search above and press return to search.
చలో చలో రష్యా... ఫుల్ ఖుషీగా జల్సా!?
By: Tupaki Desk | 10 Oct 2022 11:30 AM GMTవైసీపీ నేతలకు రష్యా అంటే మోజు పెరిగిపోతోంది. పార్టీ చేసుకోవాలంటే రష్యాకు పరుగులు తీయాల్సిందే. జల్సా చేయాలంటే రష్యాకే రూటు వేసుకోవాల్సిందేనట. లేటెస్ట్ గా సోషల్ మీడియాలో కొందరు వైసీపీ నేతల రష్యా టూర్ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. కడపకు చెందిన కీలక నేతలు అంతా ఒక ఇరవైమంది దాకా రష్యా టూర్ కి వెళ్ళారని అంటున్నారు.
ఇలా రష్యా టూర్ చేసిన వారిలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ భషా కూడా ఉన్నారట. ఒక వైసీపీ నేత అందరికీ రష్యాకు పార్టీ కోసం తీసుకెళ్లారని చెబుతున్నారు. దాంతో అక్కడ అంతా ఫుల్ ఖుషీగా గడుపుతున్నారని అంటున్నారు. రష్యాకెళ్ళి జల్సా చేసి అన్నట్లుగా అదే పనిగా కొందరు వైసీపీ నేతలు రష్యాను ఎంచుకోవడమే ఇపుడు చర్చగా ఉందిట.
నిజానికి రష్యా పరిస్థితి ఇపుడు ఏ మాత్రం బాగాలేదు అని అంటున్నారు. ఉక్రెయిన్ తో రష్యా వార్ స్టార్ట్ చేసిన తరువాత ఆ దేశానికి ఎవరూ పెద్దగా పోవడంలేదు అంటున్నారు. రష్యాకు అసలు ఈ వేళ పోమాకండి అని ట్రావెల్ అడ్వైజరీలు కూడా చెబుతున్న నేపధ్యం ఉంది. అయినా ఈ సమయంలో రష్యాలోనే పార్టీ ముద్దు అనుకుంటూ దానికే ఓటు వేయడం పట్ల అయితే చర్చ హాట్ హాట్ గానే సాగుతోంది.
దీనికంటే ముందు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తాను మంత్రిగా ఉన్న సమయంలో ప్రత్యేక విమానంలో రష్యా టూర్ చేశారు. అపుడు ఒక్క లెక్కన దాని మీద ప్రచారం సాగింది. అయితే ఒక వ్యాపారవేత్త రష్యాలో ఏర్పాటు చేసిన పార్టీకి మంత్రి సహా అంతా వెళ్లారని, వారికయ్యే ఖర్చుని అంతా సదరు వ్యాపారవేత్త భరించారు అని అంటున్నారు.
ఇపుడు కట్ చేస్తే ఉప ముఖ్యమంత్రి రష్యా లో సందడి చేస్తున్నారు అంటున్నారు. ఇలా చూసుకుంటే వైసీపీ నేతలకు రష్యా అంతలా నచ్చడం వెనక రీజనేంటి అన్నది కూడా కూపీ లాగే పనిలో కొందరు ఉన్నారని అంటున్నారు. రష్యాలో కేవలం పార్టీల కోసమేనా లేక ఇంకా ఏమైనా లావాదేవీలు ఉన్నాయా అన్న ప్రశ్నలు కూడా కొందరు లేవనెత్తుతున్నారుట.
అక్కడ కేవలం పార్టీలకేనా లేక చికోటి ప్రవీణ్ కేసినో తరహాలో ఏర్పాట్లు ఏమైనా చేశారా అన్నద్ డౌటానుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా రష్యా ఇపుడు డ్రీమ్ స్పాట్ గా వైసీపీ నేతలు కొందరికి మారింది అంటున్నారు. అందుకే ఖుషీ ఖుషీగా అక్కడ ల్యాండ్ అవుతున్నారని చెబుతున్నారు. చూడాలి మరి ఈ రష్యా టూర్ల వెనక వింతలేమిటో విశేషాలు ఏమిటో.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.