Begin typing your search above and press return to search.
హరీష్ రావుకు అడ్డొచ్చిన హైదరాబాద్
By: Tupaki Desk | 13 Dec 2018 10:03 AM GMTరాష్ట్రంలోనే అత్యధిక రికార్డు మెజారిటీ సాధించిన వ్యక్తి హరీష్ రావు. సిద్దిపేటలో ఈ ఎన్నికల్లో ఆయన లక్ష 18,339 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. అయితే రాష్ట్రంలో అత్యధిక ఓట్లు సాధించిన రికార్డు మాత్రం హరీష్ రావుకు దక్కలేదు. ఈ రికార్డు మేడ్చల్ నుండి పోటీ చేసిన చామకూర మల్లారెడ్డికి దక్కింది. ఆయన లక్షా 67,324 ఓట్లు సాధించారు. రాష్ట్రంలో మొత్తం 26 మంది ఎమ్మెల్యేలకు లక్ష పైచిలుకు ఓట్లు వచ్చాయి. అందులో టీఆర్ ఎస్ ఎమ్మెల్యులు 24 మంది ఉండగా కాంగ్రెస్ - టీడీపీల నుండి చెరొకరు ఉన్నారు. మొత్తం 26 మందిలో అత్యధిక ఓట్లు సాధించిన వారిలో 9 మంది హైదరాబాద్ - శివారు ప్రాంతాల వారే. వీరిని మినహాయించి గ్రామీణ ప్రాతిపదికన తీసుకుంటే హరీష్ రావు అత్యధిక మెజార్టీతో పాటు - అత్యధిక ఓట్లు సాధించిన వారిలో అగ్రస్థానంలో నిలుస్తున్నారు.
హైదరాబాద్ ను మినహాయిస్తే హరీష్ రావు - ఆరూరి రమేష్ - కేసీఆర్ - కేటీఆర్ - ఎర్రబెల్లి దయాకర్ రావు - సతీష్ కుమార్ వొడితెల - సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి - చల్లా ధర్మారెడ్డి - చిలుముల మదన్ రెడ్డి - ఈటెల రాజేందర్ టాప్ టెన్ స్థానాలలో చోటు సంపాదించారు. హైదరాబాద్ కలుపుకుంటే హరీష్ రావుకు నాలుగు - కేసీఆర్ కు 6 - కేటీఆర్ కు 7 స్థానాలలో నిలుస్తున్నారు. గ్రేటర్ లో ఎక్కువ మంది ఓటర్లు ఉండడం కూడా ఇక్కడ 9 మందికి అత్యధిక ఓట్లు రావడానికి కారణంగా చెప్పవచ్చు. ఏది ఏమయినా లక్షకు పైగా ఓట్లు సాధించడం అనేది ఆయా అభ్యర్థులకు మరపురాని అనుభూతి. రాష్ట్రవ్యాప్తంగా లక్ష పైచిలుకు ఓట్లు సాధించిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.
1. చామకూర మల్లారెడ్డి - 167324 మేడ్చల్
2. కేపీ వివేకానంద - 154500 కుత్బుల్లాపూర్
3. అరికెపూడి గాంధీ - 143307 శేరిలింగంపల్లి
4. తన్నీరు హరీష్ రావు - 131295 సిద్దిపేట
5. ఆరూరి రమేష్ - 131252 వర్ధన్నపేట
6. కేసీఆర్ - 125444 గజ్వేల్
7. కేటీఆర్ - 125213 సిరిసిల్ల
8. ఎర్రబెల్లి దయాకర్ రావు - 117504 పాలకుర్తి
9. భేతి సుభాష్ రెడ్డి - 117442 ఉప్పల్
10. సతీష్ కుమార్ వొడితెల - 117083 హుస్నాబాద్
11. గూడెం మహిపాల్ రెడ్డి - 116474 పటాన్ చెరు
12. మైనంపల్లి హన్మంత్ రావు - 114149 మల్కాజ్ గిరి
13. దేవిరెడ్డి సుధీర్ రెడ్డి - 113980 ఎల్బీ నగర్
14. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి - 111956 వనపర్తి
15. మాధవరం కృష్ణారావు - 111612 కూకట్ పల్లి
16. తోలుకంటి ప్రకాష్ గౌడ్ - 108964 రాజేంద్రనగర్
17. చల్లా ధర్మారెడ్డి - 105903 పరకాల
18. చిలుముల మదన్ రెడ్డి - 105665 నర్సాపూర్
19. ఈటెల రాజేందర్ - 104840 హుజూరాబాద్
20. ఎం.సంజయ్ కుమార్ - 104247 జగిత్యాల
21. క్రాంతికిరణ్ చంటి - 104229 ఆంధోల్
22. అజయ్ కుమార్ పువ్వాడ - 102760 ఖమ్మం
23. మర్రి జనార్ధన్ రెడ్డి - 102493 నాగర్ కర్నూల్
24. వీఎం.అబ్రహం - 102105 అలంపూర్
25. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి - 100415 గద్వాల
26. సండ్ర వెంకటవీరయ్య - 100044 సత్తుపల్లి