Begin typing your search above and press return to search.

వింతగాయం: క్యాచ్ తీసుకుంటూ 4 పళ్లు రాలగొట్టుకున్న ప్రముఖ క్రికెటర్..

By:  Tupaki Desk   |   9 Dec 2022 4:39 AM GMT
వింతగాయం: క్యాచ్ తీసుకుంటూ 4 పళ్లు రాలగొట్టుకున్న ప్రముఖ క్రికెటర్..
X
క్రీడల్లో గాయాలు తప్పవు. క్రీడ ఆడటం.. గాయం లేకుండా వెళ్ళడం కష్టం. ఇటీవలే బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ఇలానే గాయపడి ఆఖరుకు వీరోచితంగా బ్యాటింగ్ చేశాడు. ముఖ్యంగా క్రికెట్ లాంటి క్రీడలో గాయాలు కామన్ గా అవుతూనే ఉంటాయి. గాయంతోనే కెరీర్ కోల్పోయిన వాళ్లు చాలా మంది ఉన్నారు. కొన్నిసార్లు విచిత్రమైన గాయాలు జరుగుతాయి. లంక ప్రీమియర్ లీగ్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సరిగ్గా అదే జరిగింది.

శ్రీలంక క్రికెటర్ చమిక కరుణరత్నేకు అరుదైన గాయం ఎదురైంది. ఇది 'క్యాండీ ఫాల్కన్స్' మరియు 'గాలే గ్లాడియేటర్స్' మధ్య జరుగుతున్న మ్యాచ్ లో చోటుచేసుకుంది. క్యాండీ ఫాల్కన్‌ల తరఫున ఆడుతూ శ్రీలంక ప్రముఖ క్రికెటర్ చమికా క్యాచ్ పట్టాడు. అది అతని మూతిపై పడింది. అయినా దాన్ని క్యాచ్ పట్టాడు. కానీ అతడి బంతి బలంగా తాకడంతో అతడి నాలుగు పళ్లు రాలిపోయాయి. రక్తం జలజలా కారడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు.

చమిక ఆఫ్ సైడ్‌లో సర్కిల్ లోపల ఫీల్డింగ్ చేస్తూ క్యాచ్ తీసుకోవడానికి వెనక్కి పరుగెత్తాడు. అతను గాల్లోకి లేచిన బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. అతని చేతుల్లోకి బంతిని సేకరించేలోపు చమికా అతని ముఖానికి బంతి తాకడంతో తర్వాత ఏమి జరిగిందో అర్థం చేసుకోలేకపోయాడు.. క్యాచ్ అయితే పట్టాడు కానీ అతడి మూతిమీద పడడంతో నాలుగు పళ్లు ఊడిపోయాయి. చమికా తీసుకున్న క్యాచ్ చాలా బాధతో ఉంది.

క్యాచ్ పట్టినా క్రికెటర్ గాయపడడంతో అతని సహచరులు కంగారుపడి ఆస్పత్రికి తరలించారు. తరువాత బంతి నోటికి తగలడం వల్ల చమికకు నాలుగు దంతాలు పోయాయని వైద్యులు తెలిపారు. చమికను గాలేలోని ఓ ఆసుపత్రిలో చేర్చగా, అతను క్షేమంగా ఉన్నాడని, టోర్నీలో క్యాండీ తరుపున ఆడడానికి సిద్ధంగా ఉన్నాడని ఫాల్కన్స్ యాజమాన్యం తెలిపింది.

ఈ మ్యాచ్ లో ఫాల్కన్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో ఈ గాయంతో చమికాకు కొంత ఊరట లభించింది.

క్రికెట్ ఆటలో చాలా మందికి ఇంతకంటే చాలా పెద్ద గాయాలు తగిలాయి. ఫిలిప్ హ్యూస్ మెడ వెనుక భాగంలో బంతి తగలడంతో అతను ప్రాణాలు కూడా కోల్పోవడం ఎవరు మర్చిపోలేదు.. మార్క్ బౌచర్ ఒక కన్నుకు దెబ్బ తగిలి, ఆ కంటిలో ఇప్పటికీ చూపు కోల్పోయాడు, ఇది అతని క్రికెట్ కెరీర్ కూడా అకాల ముగింపుకు దారితీసింది. ఇలా డేంజరస్ క్రికెట్ గేమ్ ఆటగాళ్ల ప్రాణాలకే ముప్పు తెచ్చిపెడుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.