Begin typing your search above and press return to search.
తిరిగి ఇచ్చేస్తానంటే నో అంటున్న చాముండీ
By: Tupaki Desk | 13 Oct 2016 9:41 AM GMTరియో ఒలింపిక్స్ లో విశేష ప్రతిభ ప్రతిభ ప్రదర్శించిన వారికి ఖరీదైన బీఎండబ్ల్యూ కార్లను బహుకరించిన విషయం తెలిసిందే. ఇలా కార్లను సొంతం చేసుకున్న వారిలో ఒకరైన ప్రముఖ జిమ్నాస్టర్ దీపా కర్మాకర్ తనకిచ్చిన కారును తిరిగి ఇచ్చేయాలన్న నిర్ణయాన్ని నిన్ననే వెల్లడించడం తెలిసిందే. తాను ఉండే అగర్తల నగరంలో ఈ కంపెనీ సర్వీసు సెంటర్ లేకపోవటం ఒక కారణమైతే.. అక్కడి రోడ్లపై ఈ కారును నడపడం ఏమాత్రం సాధ్యం కాని పరిస్థితి. ఈ రోడ్లపై దీని నిర్వహణ అంత చిన్న విషయం కాదన్న నిర్ణయంతో తనకు కారు ఇచ్చిన క్రీడా ప్రముఖుడు చాముండేశ్వరినాథ్ కు తిరిగి ఇచ్చేస్తామని దీపా కోచ్ వెల్లడించారు.
దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావటం.. కారుకు బదులుగా డబ్బులు ఆమె అకౌంట్లో వేయాలని కోరినట్లుగా సాగుతున్న ప్రచారాలపై చాముండీ స్పందించారు. దీపా కారు తిరిగి ఇవ్వాలని అనుకుంటున్నా తాము తీసుకోవటానికి సిద్ధంగా లేనట్లుగా ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. అవసరమైతే.. కారు సర్వీస్ సెంటర్ ను దీపా ఉండే అగర్తలలో పెట్టించేందుకు కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నట్లు చెబుతున్నారు.
అయితే.. సర్వీస్ సెంటర్ ను అగర్తలలో ఏర్పాటు చేయని పక్షంలో కారును వెనక్కి తీసుకోవాలా? అన్న అంశాన్ని ఆలోచిస్తామని చాముండి చెప్పటం గమనార్హం. అయితే.. కారుకు బదులుగా దీపా డబ్బు కోరినట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. కారు నచ్చకనే తిరిగి ఇచ్చేస్తున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని.. అయితే దీప తల్లిదండ్రులు తమకు చిన్నకారు ఇచ్చేసి.. మిగిలిన మొత్తాన్ని ఇవ్వాలని కోరినట్లుగా చాముండి చెప్పారు. అన్ని బాగానే ఉన్నా.. కారు తిరిగి తీసుకునే విషయం మీద మాత్రం స్పష్టమైన మాటను చాముండి చెప్పలేదనే చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/