Begin typing your search above and press return to search.
బండి సంజయ్ పై విషప్రయోగం జరిగే ఛాన్సుంది: లాయర్లు
By: Tupaki Desk | 3 Jan 2022 12:31 PM GMTఉద్యోగుల బదిలీలు అస్తవ్యస్తంగా చేస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన జాగరణ దీక్ష ఉద్రిక్తతకు దారితీసింది. నిన్న రాత్రి బండిసంజయ్ దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అత్యంత ఉద్రిక్త పరిస్థితుల మధ్య బండి సంజయ్ ఇంటి తలుపులు బద్దలు కొట్టి మరీ ఆయనను రాత్రి 10 గంటలకు అదుపులోకి తీసుకున్నారు.
ఈరోజు కరీంనగర్ ఎక్సైజ్ కోర్టులో బండి సంజయ్ ను పోలీసులు హాజరుపరిచారు. బండి సంజయ్ కు 14 రోజుల రిమాండ్ ను ఎక్సైజ్ కోర్టు విధించింది. అయితే బండి సంజయ్ బెయిల్ పిటీషన్ కోసం హైకోర్టును ఆశ్రయిస్తామని ఆయన తరుఫున లాయర్లు తెలిపారు.
బండి సంజయ్ గాయపడ్డారని.. ఎవరు గాయపరిచింది సరిగ్గా తెలియదని.. 353 కాకుండా 333 కింద నోటీస్ ఇవ్వకుండా కోర్టుకు తీసుకువచ్చారని లాయర్లు ఆరోపించారు. కావాలనే సెషన్స్ కోర్టుకు కాకుండా ఎక్సైజ్ కోర్టుకు తీసుకువచ్చారని.. లోపల ఉన్నోళ్లు.. బయట ఉన్నోళ్లను ఎలా కొడుతారని వారు ఆరోపించారు.
బండి సంజయ్ ఎవరిని కొట్టారో ఎటువంటి రుజువు లేదని.. మేం కోర్టులో కేసును రిజక్ట్ చేయాలని కోరామన్నారు.ఇక బండి సంజయ్ పై జైలులో విష ప్రయోగం జరిగే అవకాశం ఉందని లాయర్లు కోర్టుకు వెల్లడించారు. లాయర్ల విజ్ఞప్తికి కోర్టు ఓకే చెప్పింది. బండి సంజయ్ కు అందించే ఆహారాన్ని జైలర్ రుచి చూశాకే ఇవ్వాలని ఆదేశించింది. పోలీసులు కావాలనే నోటీసులు ఇవ్వకుండా కేసు పెట్టారని.. ఇది ప్రభుత్వం దుర్మార్గపు చర్య అని ఆరోపించారు.
రేపు హైకోర్టులో మరోసారి బెయిల్ పిటీషన్ వేస్తామని వెల్లడించారు. ఒక వ్యక్తి మీద ఒకే సమయంలో నేరం ఉంటే ఒకే కేసు పెట్టాల్సి ఉందని.. కానీ ఇక్కడ రెండు కేసులు పెట్టారని లాయర్లు ఆరోపించారు.