Begin typing your search above and press return to search.

అద్వానీ పీఎం కాబోతున్నారా?

By:  Tupaki Desk   |   11 May 2019 2:30 PM GMT
అద్వానీ పీఎం కాబోతున్నారా?
X
ఏమో గుర్రం ఎగరావచ్చు.. అన్నట్టుగా ఉంది ఢిల్లీ రాజకీయం. ఎవరు పీఎం అవుతారో ఇప్పుడు ఎవరూ చెప్పలేని పరిస్థితి. మే ఇరవై మూడున ఫలితాలు వచ్చిన తర్వాత కూడా రాజకీయంలో చాలా ట్విస్టులు ఉండనే ఉంటాయి. అధికారికంగా అయితే ఎన్డీయే వైపు నుంచి మోడీ - కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థులు.

అనధికారికంగా మాత్రం బోలెడంత మంది రేసులో ఉన్నట్టే. తాము రేసులో ఉన్నట్టుగా ప్రకటించుకున్న వాళ్లు, తాము రేసులో లేనట్టుగా ప్రచారం చేసుకుంటున్న వాళ్లు.. అసలు ఎవరి ఊహగా అందని వారు కూడా ప్రధానమంత్రి పదవి రేసులో ఉన్నట్టే. అలా ఉంది రాజకీయం.

దేశ ప్రజలు ఏ పార్టీకీ మినిమం మెజారిటీ ఇవ్వని పక్షంలో కథలో బోలెడన్ని మలుపులు ఖాయం. అలాంటి సందర్భంలో ఎవరైనా జాక్ పాట్ గా పీఎం అయిపోవచ్చు. ఇలాంటి నేపథ్యంలో కొన్ని అనూహ్యమైన పేర్లు కూడా తెర మీదకు వస్తున్నాయి.

వాటిల్లో ఒకటి బీజేపీ సీనియర్ నేత అద్వానీ. ఈయనకు ఇప్పటికే మోడీ - అమిత్ షా లు రిటైర్మెంట్ ఇచ్చేశారు. ఈ ఎన్నికల్లో ఆయనను ఎంపీగా కూడా పోటీ చేయనివ్వలేదు.

అయినా అద్వానీకి ఛాన్స్ ఉందనే మాటే వినిపిస్తూ ఉంది. ఒకవేళ బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాకపోతే.. ఎన్డీయే లోకి కొత్త పార్టీలు జాయిన్ అయ్యి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి వస్తే అప్పుడు మోడీకి ప్రత్యామ్నాయంగా మరో నేతను పీఎం అభ్యర్థిగా నిలపవచ్చని అంటున్నారు విశ్లేషకులు. అందరి అమోదం ఉండే.. నేతను పీఎంగా ఎన్నుకునే అవకాశాలున్నాయి. అలాంటి నేపథ్యంలో అద్వానీకి కూడా అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. సీనియర్ గా బీజేపీలో మిగిలిన వారితో పోలిస్తే ఇప్పుడు కామ్ గా ఉంటున్న ఆయనకు అందరి ఆమోదం ఉండవచ్చని..ఆయనే పీఎంగా అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయిప్పుడు.