Begin typing your search above and press return to search.

తెలంగాణ సీఎంగా అక్బ‌రుద్దీన్‌?

By:  Tupaki Desk   |   8 Sep 2018 5:45 AM GMT
తెలంగాణ సీఎంగా అక్బ‌రుద్దీన్‌?
X
వినేందుకు విచిత్రంగా ఉన్నా.. మొత్తం విన్నంత‌నే నిజ‌మే బాసూ అన‌కుండా ఉండ‌లేని విష‌య‌మిది. మొన్న‌టి వ‌ర‌కూ టీఆర్ ఎస్ కు అత్యంత విశ్వాస‌మైన మిత్రుడిగా కేసీఆర్ మ‌న్న‌న‌లు అందుకునే మ‌జ్లిస్‌.. నిన్న ఆ పార్టీ నేత అక్బ‌రుద్దీన్ చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు ఇప్పుడుసంచ‌ల‌నంగా మారాయి.

బాంబులాంటి మాట‌ను సింఫుల్ గా చెప్పేసిన అక్బ‌రుద్దీన్ మాట‌లు ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి. నాంప‌ల్లి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో చేప‌ట్టిన ఒక స‌భ‌లో మాట్లాడిన అక్బ‌రుద్దీన్‌.. క‌ర్ణాట‌క‌లో ముఖ్య‌మంత్రిగా కుమార‌స్వామి అయిన‌ప్పుడు తెలంగాణ సీఎం ప‌ద‌విని మ‌జ్లిస్ చేప‌ట్టే అవ‌కాశం ఎందుకు ఉండ‌దు? అని ప్ర‌శ్నించ‌ట‌మే కాదు.. కేసీఆర్ న‌వంబ‌రులో ఎన్నిక‌లు డిసెంబ‌రులో ప్ర‌భుత్వ‌మ‌ని చెబుతున్నార‌ని.. అయితే డిసెంబ‌రులో మ‌జ్లిస్ జెండా ఎగుర‌వేద్దాం.. మ‌న స‌త్తా చాటుదామ‌న్న మాట అక్బరుద్దీన్ నోటి నుంచి రావటం పెను సంచ‌ల‌నంగా మారింది.

ఇటీవ‌ల జ‌రిగిన క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కుమార‌స్వామికి చెందిన‌జేడీఎస్‌పార్టీకి కేవ‌లం 30సీట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. అయితే.. కాంగ్రెస్‌.. బీజేపీల‌కు సంపూర్ణ మెజార్టీ సీట్లు సాధించ‌లేని నేప‌థ్యంలో.. త‌క్కువ సీట్లు వ‌చ్చిన‌ప్ప‌టికీ ముఖ్య‌మంత్రి ప‌ద‌విని కుమారస్వామికి ఇచ్చేందుకు కాంగ్రెస్ ఓకే చెప్పింది.

ఇదే విష‌యాన్ని త‌న‌దైన మాట‌ల్లోచెప్పిన అక్బ‌రుద్దీన్ .. క‌ర్ణాట‌క‌లో సాధ్య‌మైన‌ది తెలంగాణ‌లో ఎందుకు సాధ్యం కాద‌న్న మాట చెప్ప‌టం గ‌మ‌నార్హం.

2014 ఎన్నిక‌ల్లో మ‌జ్లిస్ కు మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉమ్మ‌డి రాష్ట్రంలోనూ.. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగి తెలంగాణ రాష్ట్రంలోనూ త‌న‌కు చెందిన ఏడు స్థానాల్ని ఎంఐఎం రెగ్యుల‌ర్ గా గెలుచుకుంటూ వ‌స్తున్నారు. గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా ఈ సంప్ర‌దాయం సాగుతోంది. దీనికి తోడు.. మ‌జ్లిస్ కు చెందిన ఏడు పాత‌బ‌స్తీ స్థానాల్ని వారికి వ‌దిలేయ‌టం ద్వారా.. రాష్ట్రంలోని మిగిలిన నియోజ‌క‌వర్గాల్లో అంతో ఇంతో మ‌జ్లిస్ సాయం ఉటుంద‌న్న మాట ఉండేది. ఇదే విధానాన్ని కేసీఆర్ ఫాలో అవుతున్నారు.

తాజా ఎన్నిక‌ల్లో తాము గెలుచుకుంటున్న 7 స్థానాల‌తో పాటు.. మ‌రో రెండు.. మూడు స్థానాల్ని గెలుచుకోవాల‌న్న ఆలోచ‌న‌లో మ‌జ్లిస్ ఉంది. ప‌ది సీట్లు సొంతం చేసుకుంటే 119 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలున్న తెలంగాణ రాష్ట్రంలో తాను కింగ్ మేక‌ర్ గా మారే వీలుంద‌న్న అభిప్రాయం మ‌జ్లిస్ లో ఉంది. అదే విష‌యాన్ని తాజాగా నిర్వ‌హించిన స‌భ‌లో అక్బ‌ర్ నోటి నుంచి వ‌చ్చింది. పైకి న‌మ్మ‌క‌స్తుడైన స్నేహితుడిగా ఉన్న మ‌జ్లిస్ నుంచి వ‌చ్చిన ఈ మాటను కేసీఆర్ ఎలా స్వీక‌రిస్తారో చూడాలి.