Begin typing your search above and press return to search.
మళ్లీ బ్యాలెట్ తప్పదా..?
By: Tupaki Desk | 3 Feb 2019 1:30 AM GMTదేశమంతా టెక్నాలజీ వైపు పరుగులు తీస్తుంటే రాజకీయ పార్టీలు మాత్రం ఈవీఎంలు వద్దంటున్నాయి. పురాతన - సంప్రదాయ బ్యాలెట్ పద్ధతినే పునరుద్దరించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో అధికార బీజేపీ మినహా - మిగతా అన్ని జాతీయ - ప్రాంతీయ పార్టీలదీ ఒకటే మాట. చివరికి బీజేపీలో కూడా కొందరు నేతలు బ్యాలెట్ విధానమే బెస్ట్ అనడంతో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లపై మరోసారి నీలిమేఘాలు కమ్ముకున్నాయి.
సుదీర్ఘ సంప్రదింపులు - చర్చలు - వాదోపవాదాల అనంతరం భారతీయ ఎన్నికల ప్రక్రియలోకి ఈవీఎంలను తీసుకురాగలిగింది ఎన్నికల కమిషన్. తద్వారా ఖర్చు - సమయాన్ని ఆదా చేయగలిగింది. తక్కువ రోజుల్లోనే ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయగలిగింది. ఒకవేళ రాజకీయ పార్టీలన్నీ మరోసారి ఏకమై, బ్యాలెట్ విధానానికే మొగ్గుచూపితే కేంద్ర ఎన్నికల సంఘం చేసేదేం ఉండదిక. మరీ ముఖ్యంగా ఈసారి ఎన్నికల్లో ఈవీఎంలను టాంపరింగ్ చేశారంటూ విమర్శలు ఎక్కువ రావడంతో, "మరోసారి బ్యాలెట్" అనే అంశంపై చర్చ ఎక్కువైంది.
బ్యాలెట్ విధానమే మరోసారి అమల్లోకి వస్తే పెరిగిన టెక్నాలజీ కారణంగా ఎన్నికల ప్రక్రియ మరింత రంజుగా మారడం ఖాయం. మెజారిటీ - లీడ్ లకు సంబంధించిన అంకెలు... వాట్సాప్ - ఫేస్ బుక్ లో మరింత వైరల్ అవుతాయి. దాదాపు రోజంతా దేశం మొత్తం ఎన్నికల ఫలితాల మీద కూర్చుంటుంది. తద్వారా సోషల్ మీడియా ఎన్నికల ఫలితాలతో హోరెత్తిపోతుంది.