Begin typing your search above and press return to search.
చేపా.. చేపా.. క్యాన్సర్ కు కేరాఫ్ అడ్రస్సా?
By: Tupaki Desk | 25 July 2018 1:30 AM GMTజలపుష్పంగా చెప్పే చేప తింటే పోషకాలకు తిరుగు ఉండదని.. ఇది బలవర్ధకమైన ఫుడ్ గా చెప్పే వారు బోలెడంత మంది కనిపిస్తారు. చేపలు తినటం మంచిదే. కానీ.. తెలుగు రాష్ట్రాల్లో దొరుకుతున్న చేపల్ని తినే ముందు మాత్రం ఒకటికి రెండుసార్లు ఆచితూచి.. చెక్ చేసుకొని తినాల్సిందేనని చెబుతున్నారు. లేకుంటే.. మొదటికే మోసం రావటమే కాదు.. క్యాన్సర్ బారిన పడే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు.
చేపల కారణంగా క్యాన్సర్ బారిన పడే ప్రమాదం భారీగా ఉందన్న మాటను చెబుతున్నారు. ఎందుకిలా అన్న విషయాన్ని వివరంగా చెబుతున్నారు కూడా. చేపల్ని సదూర ప్రాంతాలకు తరలించే వేళ.. వినియోగిస్తున్న ఫార్మాలిన్ అనే రసాయనంతో భారీ ముప్పు పొంచి ఉందని చెప్పక తప్పదు. దేశంలో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి చేపలు వెళుతూ ఉంటాయి. అయితే.. నీటిలోనుంచి చేపను పట్టుకొని బయట ఉంచితే పది నిమిషాల్లో చచ్చిపోతుంది. అదేసమయంలో చచ్చిన చేపను నాలుగు గంటల వ్యవధిలోనే వండుకు తినాలి.
కానీ.. వేర్వేరు రాష్ట్రాల నుంచి.. తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ అయ్యే చేపల్ని నిల్వ ఉంచేందుకు వీలుగా ఐస్ ముక్కల మధ్య చేపల్ని నిల్వ చేసే పద్ధతి ఒకటి ఉంది. ఐస్ ముక్కల మధ్య చేపల్ని ఉంచి ప్రయాణం చేసే వారు.. 24 గంటల వ్యవధిలోనే ఐస్ గడ్డల్ని మార్చాల్సి ఉంటుంది. కానీ.. ప్రాక్టికల్ గా ఇది సాధ్యం కాదు. దీంతో.. షార్ట్ కట్ పద్ధతిని ఆశ్రయిస్తున్నారు.
చేపల్ని సున్నా డిగ్రీల వద్ద ఉంచితే వారం వరకూ అవి పాడవ్వవు. కానీ.. సున్నా డిగ్రీల వద్ద ఉంచి రవాణా చేస్తున్న వారు ఎందరన్నది పెద్ద ప్రశ్న.ఒక చేపల లోడ్ ను ఐస్ గడ్డల మధ్య రవాణాకు సిద్ధం చేయటానికి ఆరేడు గంటలు పడుతుంది. అంతకు కొద్ది గంటల ముందు పట్టిన చేపల్ని వెంటనే రవాణాకు సిద్ధం చేసినా.. 24 గంటల అనంతరం ఆ ఐస్ గడ్డల్ని మార్చటం సాధ్యం కాని పని. ఇదో సమస్య అయితే.. కలుషిత నీళ్తో తయారుచేసే ఐస్ వినియోగం కూడా చేపలు త్వరగా చెడిపోవటానికి.. విషతుల్యం కావటానికి దోహపడుతోంది.
ఇలా సమస్యలతో కూడిన చేపల్ని రవాణా చేసేందుకు వీలుగా వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నట్లుగా తాజాగా బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. చేపల్ని ఎక్కువకాలం నిల్వ ఉంచేందుకు వీలుగా దుర్మార్గమైన పద్ధతిని వ్యాపారులు అనుసరిస్తున్నారు. మనుషుల మృతదేహాలు కుళ్లిపోకుండా ఉండేందుకు వాడే ఫార్మాల్డిహైడ్ షార్ట్ కట్ లో ఫార్మాలిన్ అనే రసాయనాన్ని నరాల్లోకి పంపుతారు. చేపల విషయానికి వస్తే.. అవి కుళ్లి పోకుండా ఎక్కువ కాలం ఫ్రెష్ గా ఉండటానికి వీలుగా ఈ రసాయనాన్ని నీళ్లలో కలిపి.. వాటిలో ముంచి తీస్తున్నారు. దీంతో.. చేపలు చూసేందుకు ఫ్రెష్ గా అనిపించినా.. వాటిల్లో మాత్రం విష రసాయనాలు నిల్వ ఉంటున్నాయి.
ప్రపంచంలో అత్యధికంగా వినియోగించే పాతి విష రసాయనాల్లో ఫార్మాల్డిహైడ్ ఒకటి. చేపల్ని కొనే ముందు చాలా మంది వాటి మెప్పల్ని కొద్దిగా పైకి లేపి.. అక్కడ ఎరుపు.. గులాబీ రంగులో ఉంటే తాజాగా ఉన్నాయని భావిస్తారు. దీన్ని గుర్తించిన వ్యాపారులు.. ఈ రసాయనాన్ని వినియోగిస్తూ వినియోగదారుల్ని బోల్తా కొట్టిస్తున్నారు.
ఈ రసాయనం రంగు లేకపోవటం.. వాసన లేకపోవటంతో పాటు తక్కువ ధరకు లభిస్తున్న కారణంగా విరివిరిగా వినియోగిస్తున్నారు. ఈ రసాయనం కలిసిన ఏ పదార్థం తిన్నా క్యాన్సర్ వస్తుందని అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధక సంస్థ వెల్లడించింది. ఈ రసాయనం కారణంగా తీవ్రమైన కడుపు నొప్పి.. వాంతులు.. పేగుపూత లాంటి అనారోగ్యానికి గురి అవుతరని చెబుతున్నారు.
మరి.. ఇలాంటి ముప్పునుఎలా ఎదుర్కొవాలి. ఈ రసాయనం బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలన్న విషయంలోకి వెళితే కొన్నిసూచనలు చేస్తున్నారు. పైప్ కింద ఫోర్సుగా పడే నీటి కింద చేపల్ని బాగా పెట్టి.. మొత్తంగా బాగా రుద్ది కడతాలి. దీంతో రసాయనం ముప్పు చాలావరకూ తొలిగే అవకాశం ఉంది.చేపల్ని కడగటానికి వాడిన నీటిని మరే ఇతర అవసరాల కోసం వాడొద్దు. చేపలు వండేవేళ.. దాని నుంచి దుర్వాసన వస్తే.. అది చెడిపోయినట్లుగా భావించి బయట పారేయాలి. చేపల్ని వండే వేళ 75 డిగ్రీల సెంటీగ్రేడ్లకు తగ్గకుండా మంట ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అదే సమయంలో సిఫ్ కిట్ పేరుతో లభిస్తున్న కిట్ ద్వారా కూడా చేపల్లో ఏదైనా రసాయనాన్ని వినియోగించారా? అన్న విషయాన్ని గుర్తించే వీలుంది. సో.. చేపల్ని తినే ముందు జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి.. లేకుంటే.. ఆరోగ్య సమస్యలు పక్కా సుమా!