Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయా?

By:  Tupaki Desk   |   14 Feb 2019 11:56 AM GMT
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయా?
X
సరిగ్గా ఎన్నికలకు కొన్ని నెలలు మాత్రమే టైమ్ ఉందనగా జాతీయ స్థాయిలో ప్రారంభమైన ఈ రసవత్తర చర్చ రాష్ట్ర రాజకీయాల్ని మరింత వేడెక్కించింది. తెలంగాణలో ఆల్రెడీ ఎన్నికలు అయిపోయాయి. కాబట్టి అక్కడ అసెంబ్లీ స్థానాల పెంపు అనేది ఇప్పట్లో జరిగే పని కాదు. కానీ కేంద్రం తలుచుకుంటే అది కూడా సాధ్యమే. ఈ సంగతి పక్కనపెడితే, ఏపీపైనే ఇప్పుడు అందరి దృష్టి పడింది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 176 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఏ స్థానంలో ఏ అభ్యర్థిని నిలబెట్టాలనే అంశంపై ఇప్పటికే టీడీపీ - వైసీపీ ఓ అవగాహనకు కూడా వచ్చాయి. సరిగ్గా ఇలాంటి టైమ్ లో అసెంబ్లీ నియోజవర్గాల విభజన అంటే అది కచ్చితంగా రాజకీయాల్లో నిప్పు రాజేసే వ్యవహారమే.

ఏపీ - తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు పెంచాలని పార్లమెంటరి స్టాండింగ్ కమిటీ సిఫార్స్ చేసింది. జాతీయ స్థాయిలో వివిధ పార్టీలకు చెందిన లోక్ సభ సభ్యులు 20 మంది - 10 మంది రాజ్యసభ సభ్యులు ఈ కమిటీలో ఉన్నారు. వీళ్లంతా కలిసి ఏపీకి 50 - తెలంగాణకు 34 అసెంబ్లీ స్థానాల పెంపును సిఫార్స్ చేశారు.

ఆర్టికల్ 170లో మార్పులు చేస్తే తప్ప అసెంబ్లీ స్థానాల పెంపు సాధ్యం కాదు. అసలే రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. ఇలాంటి టైమ్ లో అసెంబ్లీ స్థానాల పెంపు ఆ పార్టీకి కలిసొచ్చే అంశం కాదు. కాబట్టి ఈ అంశాన్ని కేంద్రం లైట్ తీసుకునే ఛాన్స్ ఉంది.