Begin typing your search above and press return to search.
మోడీకి బాబు మార్క్ ప్రజంటేషన్
By: Tupaki Desk | 15 May 2016 3:53 PM GMTవిదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. తాజాగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో రియాక్ట్ అయ్యారు. ఫారిన్ నుంచి శంషాబాద్ లో ల్యాండ్ అయిన చంద్రబాబు వెంటనే.. ఏపీకి బయలుదేరి వెళ్లి.. పార్టీ ముఖ్యనేతలతో భేటీ కావటం తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ నేతలు కుండబద్ధలు కొట్టేస్తున్న నేపథ్యంలో కింకర్తవ్యం ఏమిటన్న అంశంపై సుదీర్ఘంగా చర్చలు జరిపిన చంద్రబాబు చివరకు ప్రధాని మోడీకి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.
త్వరలో ఢిల్లీకి వెళ్లి కరువు పరిస్థితుల మీద ప్రధాని మోడీని కలవనున్న చంద్రబాబు.. పనిలో పనిగా ఏపీకి ప్రత్యేక హోదా అవసరాన్ని నొక్కి చెబుతూ.. అందుకు సంబంధించిన ఒక ప్రజంటేషన్ ను మోడీకి ఇవ్వాలన్న నిర్ణయంతో పాటు.. మిత్రుడితో ఘర్షణాత్మక ధోరణితో వ్యవహరించకుండా.. స్నేహంగా ఉంటూనే ఏపీకి ప్రత్యేకహోదా సాధించుకోవాలన్న నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు. హోదా మీద మోడీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత బాబు ప్రజంటేషన్ తో మార్పు వస్తుందా? అంటే లేదనే చెప్పాలి.
కాకుంటే.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మోడీని కన్వీన్స్ చేసేందుకు చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేయాలో.. అన్ని ప్రయత్నాలు చేస్తున్నారన్న భావన కలిగేలా చేయటం కోసం ఆ మాత్రం హడావుడి అవసరమన్న భావన వ్యక్తమవుతోంది. ఇన్నిసార్లు భేటీ అయి.. వినతి పత్రాలు ఇచ్చినా కాని పని బాబు ఇచ్చే తాజా ప్రజంటేషన్ తో మోడీ మనసు మారుతుందనుకోవటం అత్యాశే అవుతుంది. కాకుంటే.. ప్రత్యేకహోదా విషయంలో కేంద్రం పుల్ స్టాప్ పెట్టలేదని.. ద్వారాలు మూసుకోపోలేదన్న భావన కల్పించటం కోసం జరిగే మరో హడావుడి కార్యక్రమంగా బాబు ప్రజంటేషన్ ను చూడాలని చెప్పొచ్చు.