Begin typing your search above and press return to search.

మరో 15 ఏళ్లు బతుకుతానేమో.. చంద్రబాబు నిర్వేదం

By:  Tupaki Desk   |   4 Feb 2020 5:32 AM GMT
మరో 15 ఏళ్లు బతుకుతానేమో.. చంద్రబాబు నిర్వేదం
X
40ఇయర్స్ పాలిటిక్స్ చంద్రబాబు రాజకీయాల్లో గండరగండరుడు లాంటి వాడు. ఎన్టీఆర్ నుంచి వైఎస్ దాకా ఎంతో మంది ఉద్దండులను ఢీకొన్నారు. ఓడించారు. అలాంటి చంద్రబాబు నోటివెంట ఫస్ట్ టైం ఇతంటి ఆందోళనకర మాటలు వైరల్ గా మారాయి. తన జీవితంలో ఎప్పుడూ లోనుకాని నిర్వేదానికి అసహాయతకు చంద్రబాబు లోను కావడం గమనార్హం. ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన టీడీపీ అధినేత తాజాగా జగన్ పాలన చూశాక తన భవిష్యత్తు అంధకారమైనట్టు షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

మూడు రాజధానులపై మంగళవారం మంగళగిరిలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు తన నైరాశ్యాన్ని వెళ్లగక్కారు. తన వయసు 70 ఏళ్లు నిండాయని.. మానసికంగా యువకుడి గానే ఉన్నా శరీరకంగా మాత్రం బలహీనుడిని అని ఆవేదన వ్యక్తం చేస్తారు. ఆరోగ్యం సహకరిస్తే.. ఇబ్బందులు రాకుంటే మరో 15 ఏళ్లు బతుకుతానేమో అంటూ నైరాశ్యంతో షాకింగ్ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమయ్యాయి.

తనకు కుటుంబ పరంగా.. పార్టీ పరంగా.. ఆరోగ్యపరంగా సమస్యలు ప్రస్తుతానికి లేవని.. భవిష్యత్తులో మాత్రం తన ఆరోగ్యంపై చెప్పలేనని చంద్రబాబు షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. తన బాధంత రాష్ట్రం గురించేనని.. జగన్ పరిపాలన చూస్తున్నప్పుడు ఏపీ భవిష్యత్తు ఏమైపోతుందోననే బాధ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

తన సొంతూరు నారావారిపల్లెలో వైసీపీ నిర్వహించిన సభకు జనాలు రాలేదని.. బుద్ది ఉన్న వాళ్లు ఎవరూ మూడు రాజధానులను సమర్థించరని చంద్రబాబు అన్నారు. అమరావతి ని దాటి వైజాక్ ఎవరూ పోరని.. అందుకే సభకు జనాలు రాలేదని వైసీపీని ఎండగట్టారు.