Begin typing your search above and press return to search.

భోగి మంటల్లో అమరావతి నిరనసలు ...!

By:  Tupaki Desk   |   14 Jan 2020 4:34 AM GMT
భోగి మంటల్లో అమరావతి నిరనసలు ...!
X
సంక్రాంతి సంబరాలు అమరావతిలో నిరసనలతో ప్రారంభమయ్యాయి. రాజధాని పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయవాడ బెంజిసర్కిల్‌ సమీపంలోని ప్రైవేట్‌ స్థలంలో నేతలు భోగి మంటలను ఏర్పాటు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు తో సహా పార్టీ నేతలు..జేఏసీ నేతలు హాజరైన అమరావతికి అనుకూలంగా నినాదాలు చేసారు. జీఎన్‌రావు కమిటీ, బోస్టన్‌ నివేదిక ప్రతులను భోగిమంటల్లో వేసి నిరసన తెలిపారు.

ఆంధ్రులంతా ఒక్కేటే.. రాజధాని అమరావతి ఒక్కటే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మూడు రాజధానుల ప్రతిపాదనలు విరమించుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. అమరావతిని చించాలంటే భవిష్యత్‌ ఉండదని చంద్రబాబు హెచ్చరించారు. అమరావతి చారిత్రక ప్రాధాన్యాన్ని కాపాడుకోవాలని బాబు పిలుపునిచ్చారు. అమరావతిని నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సాయం చేశారని గుర్తు చేశారు.

కార్యక్రమానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, టీడీపీ నేతలు, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, జనసేన నాయకురాలు రజని, మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్‌ గద్దె అనురాధ హాజరయ్యారు, పెద్ద ఎత్తున మహిళలు, విద్యార్థులు తరలివచ్చారు. ఈ సందర్భంగా జీఎన్‌రావు కమిటీ, బోస్టన్‌ నివేదిక ప్రతులను భోగిమంటల్లో వేసి నిరసన తెలిపారు. ఆంధ్రులంతా ఒక్కేటే.. రాజధాని అమరావతి ఒక్కటే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మూడు రాజధానుల ప్రతిపాదనలు విరమించుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. మరోవైపు ఏపీలోని పలు జిల్లాల్లో భోగి మంటలు ఏర్పాటు చేసి జీఎన్‌రావు కమిటీ, బోస్టన్‌ నివేదిక ప్రతులను అందులో వేసి నిరసనలు తెలుపుతున్నారు. సంక్రాంతి వేడుకలకు దూరంగా ఉన్న రాజధాని గ్రామ ప్రజలు మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ బెంజ్ సర్కిల్ వద్ద భోగి మంటలు వేశారు. భోగి మంటల చుట్టూ తిరుగుతూ అమరావతి రాజధానిగా కొనసాగించాలని నినాదాలు చేసారు.