Begin typing your search above and press return to search.

జగన్ కాచుకో : బాబు...పవన్ మల్టీస్టారర్ మూవీయేనట...?

By:  Tupaki Desk   |   5 Aug 2022 2:30 AM GMT
జగన్ కాచుకో : బాబు...పవన్ మల్టీస్టారర్ మూవీయేనట...?
X
ఏపీ రాజకీయాలు ఇపుడు జోరు మీద ఉన్నాయి. ఎన్నికలు దగ్గరలో లేకపోయినా ఆ వేడి వాడి మాత్రం కనిపిస్తోంది. ఏపీలో చూస్తే అధికార వైసీపీ మరో మారు పవర్ ని అందుకోవాలని చూస్తోంది. ఇక విపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అయితే కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరుతామని శపధం చేస్తోంది. తమ పార్టీని జనాలు ఈసారి కచ్చితంగా ఆదరిస్తారు అని చంద్రబాబు కడు నమ్మకంగా ఉన్నారు.

ఇంకో వైపు పొత్తుల గురించి ముందే మాట్లాడిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఇపుడు కొత్త ఎత్తుగడలతో ముందుకు వెళ్తున్నారు. సొంతంగా బలం పెంచుకోవడం మీదనే ఆయన దృష్టి సారిస్తున్నారు. దానికి నాందిగా అక్టోబర్ 5 నుంచి ఆయన బస్సు యాత్రను చేపడుతున్నారు. ఇక నవంబర్ నుంచి లోకేష్ పాదయాత్ర చేస్తారని అంటున్నారు. చంద్రబాబు సైతం జిల్లా టూర్లతో పాటు బస్సు యాత్రకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ నేపధ్యంలో టీడీపీ జనసేన ఎవరికి వారుగా రాజకీయాలు చేస్తున్నా ఇదంతా పక్కా ప్లాన్ లో భాగనే అంటున్నారు. సరైన టైన్ లో ఈ రెండు పార్టీలూ చేతులు కలుపుతాయని అంటున్నారు. ఇప్పటికిపుడు పొత్తులు అంటే భారీ నష్టం కలుగుతుందని, టికెట్ దక్కని వారు అంతా వైసీపీలో చేరితే ఆ పార్టీకి అనవసరమైన బలం ఇచ్చినట్లుగా ఉంటుందని కూడా భావిస్తున్నారుట.

అందువల్ల బయట ఒక్క మాట మాట్లాడకుండా గుంభనంగా ఉంటున్నా ఈ ఇద్దరు నేతలు పొత్తుల విషయంలో ఒకే మాటగా బాటగా సాగుతారని అంటున్నారు. ఏపీలో రాజకీయ గణాంకాలు చూసుకుంటే జనసేన, టీడీపీ కలిస్తే మాత్రం కచ్చితంగా వైసీపీకి గట్టి దెబ్బ పడుతుంది. ఈ రెండు పార్టీలు కనుక పొత్తులు పెట్టుకుంటే ఉత్తరాంధ్రా నుంచి ఉత్తర కోస్తా జిల్లాలు అన్నింటా క్లీన్ స్వీప్ చేసే చాన్స్ ఉంది. అదే విధంగా మారిన రాజకీయ నేపధ్యంలో రాయలసీమలోనూ ఈసారి వైసీపీ బలం తగ్గుతుంది అంటున్నారు.

అంటే వైసీపీని గద్దె దించాలీ అంటే తమ కలయిక తప్పదు అనివార్యం అన్న సంగతి పవన్ బాబులకు తెలుసు అంటున్నారు. ఆ విషయం తెలియని రాజకీయ అయోమయం కానీ అమాయకత్వం కానీ వారిద్దరికీ లేదనే చెబుతున్నారు. ఇక బయటకు మాత్రం ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోకుండా చాలా తెలివిగానే మైండ్ గేమ్ స్టార్ట్ చేశారని చెబుతున్నారు. మరి ఈ ఎత్తుగడను జగన్ ఏ విధంగా ఎదుర్కోంటాడో. ఈ పొత్తుల వ్యూహాలను ఎలా కాచుకుంటారో చూడాల్సిందే.