Begin typing your search above and press return to search.

జీవో-1 వ‌ద్దు.. మ‌రి ఏం చేద్దాం.. బాబూ..!

By:  Tupaki Desk   |   8 Jan 2023 2:30 AM GMT
జీవో-1 వ‌ద్దు.. మ‌రి ఏం చేద్దాం.. బాబూ..!
X
ఏపీ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన జీవో -1/2023పై తీవ్ర స్థాయిలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆందోళ‌న‌, ఆవే దన వ్య‌క్తం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ జీవోను కేవ‌లం టీడీపీ కోస‌మే తెచ్చార‌ని, అది కూడా త‌న‌ను నిలువ‌రించేందుకు మాత్ర‌మే తెచ్చార‌ని.. చంద్ర‌బాబు ఇటీవ‌ల కుప్పంలో తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. జీవో ను చీక‌టి చ‌ట్టంతో పోల్చారు. బ్రిటీష్ వారు కూడా గాంధీ గారికి ఆందోళ‌న చేసుకునే అవ‌కాశం ఇచ్చార‌ని అన్నారు.

కానీ, జ‌గ‌న్ మాత్రం ఇలా.. ప్ర‌తిప‌క్షాల‌ను అడ్డుకునేందుకు ఇలా చీక‌టి జీవో తెచ్చార‌ని దుయ్య‌బ‌ట్టారు. రోడ్డు పై కాకుండా.. స‌భ‌లు ఎక్క‌డ పెట్టుకోవాలి.. రోడ్డుపై కాకుండా.. ర్యాలీలు, రోడ్ షోలు ఎక్క‌డ నిర్వహించుకోవా లి? అని నిల‌దీశారు. ఓకే..చంద్ర‌బాబు ఆవేద‌న‌, ఆందోళ‌న‌ను ప్ర‌తి ఒక్క‌రూ అర్థం చేసుకోవాల్సిందే.. చేసుకున్నారు కూడా! అయితే.. అదే స‌మ‌యంలో కందుకూరు, గుంటూరు ఘ‌ట‌న‌ల‌ను తోసిపుచ్చ‌లేం క‌దా!

కందుకూరులో ఏకంగా 8 మంది, గుంటూరులో ముగ్గ‌రు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప‌రిణామాల వెనుక ఏం జ‌రిగింద‌నేది ఒక భాగ‌మైతే.. అస‌లు ఇలాంటివి వెలుగు చూసిన‌ప్పుడు.. వాటి క‌ట్ట‌డికి.. ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుని తీరాలి. ప్ర‌జ‌ల ప్రాణాల‌కు బాధ్య‌త వ‌హించే ప్ర‌భుత్వం ఏదైనా ఒక నిర్ణ‌యం తీసుకువ‌స్తుంది.ఒక వేళ ఇది ఇబ్బందిగా ఉన్నా.. త‌ప్ప‌ని అనిపించినా.. సీనియ‌ర్ నాయ‌కుడు, 14 ఏళ్ల సీఎం అయిన‌.. చంద్ర‌బాబు సూచ‌న‌లు చేయొచ్చుక‌దా?!

కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు.. జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌కు సంబంధించి ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన జీవోను త‌ప్పుబ‌ట్టిన చంద్ర‌బాబు.. అదే ఇప్పుడు త‌న ప్ర‌భుత్వం ఉంటే.. ఇలా చేసేవాడిని.. ఇలాంటి చ‌ర్య‌లు తీసుకునేవాళ్లం అని మాట‌మాత్రంగా చెప్ప‌డంలేదు. ఒక సూచ‌న కానీ స‌ల‌హాకానీ ఇవ్వ‌డం లేదు. పోనీ.. ఈ జీవో త‌ప్ప‌ని ఇబ్బందిగా ఉంద‌ని భావిస్తే.. దీనిని హైకోర్టులో స‌వాల్ చేయొచ్చు. అదీ చేయ‌డం లేదు. మొత్తంగా.. ఈ రెండు చేయ‌డం మానేసి.. జీవో చుట్టూ రాజ‌కీయం చేయ‌డం వ‌ల్ల‌.. ప్ర‌జ‌ల్లో సింపతీ వ‌స్తుంద‌ని భావిస్తే.. ఏం జ‌రుగుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.