Begin typing your search above and press return to search.

టీడీపీ స్పీక్స్ : గుర్తు పెట్టుకోండి వాళ్లంతా జ‌గ‌న్ వ్య‌తిరేకులే !

By:  Tupaki Desk   |   20 May 2022 4:30 PM GMT
టీడీపీ స్పీక్స్ : గుర్తు పెట్టుకోండి వాళ్లంతా జ‌గ‌న్ వ్య‌తిరేకులే !
X
ఆంధ్రావ‌ని వాకిట ఎన్ని పార్టీలున్నా పోరు మాత్రం రెండంటే రెండే పార్టీల మ‌ధ్య జరగనుంది. మిగిలిన పార్టీలు అన్నీ వాటికి ఊతంగా ఉండ‌డమో లేదా మ‌ద్ద‌తు ఇవ్వ‌డ‌మో అన్న‌వి చేయ‌నున్నాయి. అవి వాటి ప్రాథ‌మిక ప్ర‌తిపాద‌న‌లు మ‌రియు ప‌ర‌ప‌తి మేరకు ప్ర‌వ‌ర్తించ‌నున్నాయి. సైద్ధాంతిక‌త ఆధారంగా పొత్తులు ఉన్నాయా లేదా ఉంటాయా అన్న‌వి ఇక్క‌డ అప్ర‌స్తుతం.

ఆ విధంగా ఇప్పుడు వైసీపీ మ‌రియు టీడీపీ మ‌ధ్య యుద్ధానికి లేదా తీవ్ర పోరుకు తెర‌లేచింది. ముఖ్యంగా ముఖ్య‌మంత్రి విధానాల‌పై మ‌రియు చేస్తున్న నిర్ణ‌యాలు, ఇస్తున్న ప్ర‌క‌ట‌న‌ల‌పై కోపంగా ఉన్న కొన్ని వ‌ర్గాలు ఆయ‌న‌కు దూరంగా ఉంటాయి అని, ఆ విధంగా సంబంధిత శ్రేణులు లేదా సామాజిక వ‌ర్గాలు అన్నీ త‌మ‌కు అనుకూలంగా ఉంటాయి అని ప‌సుపు దండును అమితోత్సాహంతో ముందుకు న‌డిపిస్తున్న ద‌ళ‌ప‌తి చంద్ర‌బాబు నాయుడుతో స‌హా ప‌లువురు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు.

నిన్న‌టి వేళ క‌ర్నూలులో కూడా చంద్ర‌బాబు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుత ప్ర‌భుత్వ తీరును విమ‌ర్శిస్తూ.. టీడీపీ విస్తృత స్థాయి స‌మావేశంలో కీల‌కోపన్యాసం చేశారు. జ‌గ‌న్ పాల‌న అన్న‌ది క‌రోనా క‌న్న భ‌యంక‌రంగా ఉంద‌ని తేల్చేశారు. ప్ర‌జ‌ల‌ను వేధించి ఆనందం పొందుతున్నార‌ని అన్నారు. రాష్ట్రానికి మ‌రో ప్ర‌జా ఉద్య‌మం అవ‌స‌రం అని భావిస్తూ, సంబంధిత దిశానిర్దేశానికి తాను సిద్ధ‌మేన‌ని ప్ర‌క‌టించి స‌భికుల్లో ఉత్సాహం నింపారు. శ్రేణుల్లో పూర్వ చైత‌న్యం ఒక‌టి తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నించారు.

ఇక టీడీపీ ప్ర‌చారం చేస్తున్న

వైసీపీ త‌ప్పిదాలు కొన్ని చూద్దాం..

వివేచిద్దాం వివేక‌వంతం అయిన చ‌ర్చ ఉంటే

ఆహ్వానిద్దాం..

- ఒక‌టి :

సీపీఎస్ ర‌ద్దుకు సంబంధించి ఆ రోజు పాద‌యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ మాట ఇచ్చారు. త‌రువాత త‌ప్పారు. ఇప్పుడేమో జీపీఎస్ అంటున్నారు. ఓపీఎస్ కాదు సీపీఎస్ కాదు జీపీఎస్ అంటే జ‌న‌ర‌ల్ పెన్ష‌న్ స్కీం ను తెర‌పైకి తెస్తున్నారు. ఇది కూడా త‌మ‌కు ప్ర‌యోజ‌న పూర్వ‌క చ‌ర్య కాద‌ని ఉద్యోగులు తేల్చేస్తున్నారు క‌నుక వాళ్లంతా వైసీపీకి ఓట్లేయ‌ర‌ని అంటోంది టీడీపీ.

- రెండు :

ఇంత‌వ‌ర‌కూ జాబ్ క్యాలెండ‌ర్ అమ‌ల్లో లేదు. స‌చివాల‌య ఉద్యోగాలు త‌ప్ప మ‌రొక నోటిఫికేష‌న్ లేదు. వాళ్ల‌కు కూడా జాబ్ రెగ్యుల‌రైజ్ అవుతుంద‌న్న గ్యారంటీ ఇప్ప‌ట్లో లేదు. అయినా కూడా అంద‌రికీ ఆర్థిక ల‌బ్ధి ఏక కాలంలో జ‌రుగుతుందో లేదో కూడా చెప్ప‌లేం. క‌నుక యువ‌త‌తో పాటు వారి త‌ల్లిదండ్రులు కూడా వైసీపీకి ఓటెయ్య‌రు అని అంటోంది టీడీపీ.

- మూడు :

ఇదే విధంగా అన్యాయం అయిన ద‌ళితులు కానీ మైనార్టీలు కానీ ఓట్లెయ్య‌రు. అదేవిధంగా బీసీ వ‌ర్గాల‌కూ చేసిన సాయం క‌న్నా చేసిన ద్రోహం ఎక్కువ‌గానే ఉంద‌ని టీడీపీ అంటోంది. అర్హ‌త ఉన్న బీసీల‌కు సంబంధించి విదేశీ విద్య‌కు గ‌తంలో అందించిన ఆర్థిక సాయం కూడా నిలిపి వేయ‌డం దారుణమ‌ని గ‌గ్గోలు పెడుతోంది టీడీపీ. ఇవ‌న్నీ వైసీపీ ఎదుగుద‌ల‌కు ప్ర‌తిబంధ‌కాలే !

ఆఖరుగా... :

వీటితో పాటు ధ‌ర‌ల పెరుగుద‌ల, నిఘా వ్య‌వ‌స్థ వైఫల్యం, య‌థేచ్ఛ‌గా సాగుతున్న గంజాయి ర‌వాణా, నాటు సారా విక్ర‌యం వీటితో పాటు ఇంకొన్ని పాల‌న సంబంధ వైఫ‌ల్యాలే జ‌గ‌న్-ను రానున్న కాలాన ఇంటికి ప‌రిమితం చేయ‌నున్నాయి అని అంటోంది టీడీపీ.