Begin typing your search above and press return to search.

అమరావ‌తిపై మడ‌మ తిప్పారా లేదా? జ‌గ‌న్‌కు చంద్ర‌బాబుసూటి ప్ర‌శ్న‌

By:  Tupaki Desk   |   17 Dec 2021 2:30 PM GMT
అమరావ‌తిపై మడ‌మ తిప్పారా లేదా?  జ‌గ‌న్‌కు చంద్ర‌బాబుసూటి ప్ర‌శ్న‌
X
రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో సీఎం జ‌గ‌న్ మాట‌త‌ప్పారా?  లేదా?  చెప్పాల‌ని.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు సూటిగా ప్ర‌శ్నించారు. అంతేకాదు.. ఎన్నిక‌ల‌కు ముందు.. ఏం చెప్పారు.. త‌ర్వాత‌.. ఏం చేస్తున్నారు? అని నిల‌దీశారు. అమ‌రావ‌తి రాజ‌ధానిని నిల‌బెట్టుకునేందుకు రాజ‌ధాని రైతులు చేప‌ట్టిన న్యాయస్థానం నుంచి దేవ‌స్థానం వ‌ర‌కు పాద‌యాత్ర ముగిసిన‌నేప‌థ్యంలో తిరుప‌తిలో నిర్వ‌హించిన మ‌హా స‌భ‌లో చంద్ర‌బాబు ప్ర‌సంగించారు. ఆసాంతం .. జ‌గ‌న్ వైఖ‌రిని నిల‌దీస్తూ.. అమ‌రావ‌తి ప్రాధాన్యాన్ని చంద్ర‌బాబు వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు.

చంద్ర‌బాబు ఏమ‌న్నారంటే.. ``అమ‌రావ‌తి రాజ‌ధానిని జ‌గ‌న్‌రెడ్డి కావాల‌న్నారా లేదా? మ‌రి ఇప్పుడు ఎందుకు మ‌డ‌మ తిప్పారు. ఇది ప్ర‌జారాజ‌ధాని.. ప్ర‌జ‌లు కోరుకున్న రాజ‌ధాని.. అన్ని దేవాల‌యాలు.. చ‌ర్చిలు.. మ‌సీదులు ఆశీర్వ‌దించిన రాజ‌ధాని. అలాంటి రాజ‌ధానితో మీరు(జ‌గ‌న్‌) మూడుముక్క‌లాట ఆడ‌తారా? ఈయ‌న రోజుకోమాట మాట్లాడ‌తారు. రాజ‌ధాని కోసం, స‌భ‌కోసం సంఘీభావం కోసం వ‌స్తుంటే.. పోలీసులు అడ్డుప‌డ్డారు. నిల‌బెట్టారు. ఇళ్ల‌కు పోలీసులు వ‌చ్చారు. నేత‌ల‌ను గృహ నిర్బంధం చేశారు`` అని నిప్పులు చెరిగారు.

``ప్రాంతాల మ‌ధ్య చిచ్చు పెట్టొద్దు. అమ‌రావ‌తిపై దుష్ప్ర‌చారం చేశారు. అది మునిగిపోతుంద‌ని అన్నా రు. మూడేళ్ల‌యింది.. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క చుక్క‌రాలేదు. ఎన్నో ప్రాంతాలు మునిగిపోయాయి. అయినా.. అమ‌రావ‌తికి ఏం కాలేదు. భూమి మంచిది కాదని ప్ర‌చారం చేశారు. కానీ, చెన్నై, హైద‌రాబాద్‌కంటే స్ట్రాంగ్ పునాదులు వేసుకునే అవ‌కాశం ఉంది. ఈ విష‌యాన్ని కూడా విస్మ‌రించారు. ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ అన్నారు. అస‌లు ఇది ల్యాండ్ ఎక్విజిష‌న్ యాక్ట్‌లోనే లేదు. హైకోర్టు చెప్పింది.. సుప్రీం కోర్టు చెప్పింది ఎలాంటి అక్ర‌మాలు జ‌ర‌గ‌లేద‌ని తేల్చాయి. ఎస్సీ, ఎస్టీల‌కు కూడా డ‌బ్బులు ఇచ్చి భూములు తీసుకున్నాం.`` అని చంద్ర‌బాబు వివ‌రించారు.

``మీరు ఎన్నికేసులు అయినా పెట్టండి.. మేం ధ‌ర్మ పోరాటం చేస్తున్నాం. అమ‌రావ‌తి రాజ‌ధాని రైతుల‌దే విజ‌యం. త్యాగం అమ‌రావ‌తి రైతుల‌ది.. పోరాటం అమ‌రావ‌తి రైతుల‌ది. కానీ, వారి పోరాటం మాత్రం ఐదు కోట్ల ఆంధ్రుల పోరాటం. రాజ‌ధాని క‌ట్టేందుకు డ‌బ్బులు లేవంటాడు. ఒక్క‌పైసా పెట్టుబ‌డి పెట్ట‌క్క‌ర్లేదు. అమ‌రావతిలో భూములు అమ్ముకుంటే.. ఇక్క‌డే.. పెట్టుబడులువ‌స్తాయి. సైబ‌రాబాద్ న‌గ‌రం ఏర్పాటు చేశాం. గుంటూరు.. విజ‌య‌వాడ న‌గ‌రాలు రాష్ట్రానికి న‌డిబొడ్డున అమ‌రావ‌తిని ఏర్పాటు చేశాం. అటు 12 పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాలు.. ఇటు 12 పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌కు.. న‌డిబొడ్డున ఉండేలా నిర్ణ‌యించాం.`` అని చంద్ర‌బాబు వివ‌రించారు.

``అమ‌రావ‌తిని కాపాడే ఘ‌న‌త ప్ర‌జ‌లే భుజాల‌కు ఎత్తుకుంటారు. అమ‌రావ‌తిని కాపాడుకుందాం. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను కాపాడుకుందాం. అభివృద్ధి అన్నిప్రాంతాల్లోనూ కావాలి. రాజ‌ధాని మాత్రం అమ‌రావ‌తిగానే ఉండాలి. అమ‌రావ‌తికి అన్ని పార్టీలూ మ‌ద్ద‌తిచ్చాయి. అప్ప‌ట్లో వైసీపీ కూడా మ‌ద్ద‌తిచ్చింది. అధికారంలోకి రాగానే క‌ళ్లు నెత్తికి ఎక్కాయి. ఇప్ప‌టికైనా.. మీకు చేత‌నైతే.. అమ‌రావ‌తిని నిర్మించండి. లేక‌పోతే.. అలా వ‌దిలేయండి.. అదే సంపాయించుకుంటుంది జై అమ‌రావ‌తి`` అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. స‌భ‌కు వ‌చ్చిన వారితో జై అమ‌రావ‌తి నినాదాలు చేయించారు.