Begin typing your search above and press return to search.

కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్.. బెంబేలెత్తుతున్న బాబు?

By:  Tupaki Desk   |   24 Feb 2019 7:37 AM GMT
కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్.. బెంబేలెత్తుతున్న బాబు?
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమను ఓడించాలని చూసి.. చాలానే కష్టపడ్డ చంద్రబాబు నాయుడుకు తాము రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరతామని అప్పట్లోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. తమకు చంద్రబాబు నాయుడు గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాడు కాబట్టి.. తాము ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం ఖాయమని కేసీఆర్ ప్రకటించాడు. అయితే ఆ ప్రకటన పట్లల మొదట్లో చంద్రబాబు నాయుడు ఎదురుదాడి చేశాడు. మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాడు. ‘ఏం రిటర్న్ గిఫ్ట్ ఇస్తారో చూద్దాం..’అంటూ బాబు అన్నాడు.

తను భయపడను అన్నట్టుగా చంద్రబాబు నాయుడు కలరింగ్ ఇచ్చాడు. అప్పుడు అయితే అలా వ్యవహరించాడు కానీ..ఇప్పుడు తెరాస రిటర్న్ గిఫ్ట్ భయం చంద్రబాబు నాయుడుకు గట్టిగా పట్టుకుందని వార్తలు వస్తున్నాయి. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఇప్పటికే ఏపీలో రెండు దఫాలుగా పర్యటించాడు. కేవలం రెండు సార్లు మాత్రమే కాదు.. తను మరిన్ని సార్లు ఏపీలో పర్యటిస్టున్నట్టుగా తలసాని ప్రకటించాడు కూడా.

ఎన్నికల్లోపు ఏపీలో గట్టిగా తిరుతున్నట్టుగా తలసాని ప్రకటించాడు. తలసాని సామాజికవర్గం ప్రజల సంఖ్య ఏపీలో గణనీయంగా ఉంది. వాళ్లంతా తలసాని చెప్పినట్టుగా ఓటేస్తారని కాదు కానీ..ఎంతో కొంతో ప్రభావం అయితే ఉండకపోదు. స్థూలంగా బీసీలను లక్ష్యంగా చేసుకుని తలసాని రంగంలోకి దిగాడు. ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బీసీ గర్జన కార్యక్రమం కూడా విజయవంతం అయ్యింది.

ఆ కార్యక్రమానికి కృష్ణయ్య కూడా హాజరయ్యాడు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు రాజకీయంతో బీసీలు విసిగిపోయారు. తమ రిజర్వేషన్లకు కూడా చంద్రబాబు నాయుడు ఎసరు తెస్తున్నాడు అనే భయం వారిలో మొదలైంది. ఇలాంటి నేపథ్యంలో బాబుకు మరో చాన్స్ ఇవ్వడానికి వారు సిద్ధంగా లేరనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో అలాంటి వర్గాలను పూర్తిగా తెలుగుదేశం వ్యతిరేకంగా ఉసిగొల్పితే ఆ దెబ్బ ఆ పార్టీకి గట్టిగా తగిలే అవకాశం ఉంది. ఇక కేవలం ఓటర్లనే కాకుండా లీడర్లను కూడా టార్గెట్ గా చేసుకుంటున్నాడు
తలసాని.

ఈ మేరకు వారితో సంప్రదింపులు జరిపి.. తెలుగుదేశం పార్టీ ని వీడే ఆసక్తితో ఉన్న వారికి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాడు.ఏపీ రాజకీయ వ్యవహారాల్లోకి తలసాని ఎంట్రీ విషయంలో కేసీఆర్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది. ఓవరాల్ గా… కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ప్రభావంతో.. చంద్రబాబు నాయుడు బెంబేలెత్తున్నారని మాత్రం స్పష్టం అవుతోంది.