Begin typing your search above and press return to search.
కొడుకు ఏమైపోతాడో.. బాబు భయం..
By: Tupaki Desk | 2 April 2019 11:11 AM GMTఅనుకున్నది ఒక్కటి.. అయ్యిందొక్కటిలా మంగళగిరిలో పరిస్థితి మారుతోందా? కొడుకు గెలుపుపై చంద్రబాబులో అంతర్మథనం మొదలైందా? మంగళగిరిలో తాజా పరిస్థితులు... పరిణామాలు.. సర్వేలు టీడీపీని కలవరపెడుతున్నాయి. అనవసరంగా లోకేష్ కు మంగళగిరిని కేటాయించామా అన్న అసహనం బాబులో వ్యక్తమవుతోందని వార్తలు వస్తున్నాయి.
నిజానికి ఎమ్మెల్సీగా ఎన్నికైన నారాలోకేష్ ను తొలిసారి చంద్రబాబు ప్రత్యక్ష ఎన్నికల్లో దించాడు. కొడుకును గెలిపించుకోవడానికి ఎన్నో సర్వేలు, నేతల అభిప్రాయాలు.. ఇంటెలిజెన్స్ సర్వేలు తెప్పించుకొని విశ్లేషించుకొని మరీ 'మంగళగిరి' నుంచి లోకేష్ ను బరిలోకి దింపాడు. అయితే మంగళగిరితోపాటు 'భీమిలి' కూడా టీడీపీ గెలిచే సీటుగా తేలినా నాయకులు తప్పుదోవ పట్టించడంతోనే చంద్రబాబు 'మంగళగిరి' ని ఖాయం చేశాడని సమాచారం. ఇప్పుడు మంగళగిరిలో పరిస్థితులు చూసి నాయకులపై చంద్రబాబు సీరియస్ అయ్యాడని వార్తలొస్తున్నాయి. మంగళగిరి సేఫ్ అని చెప్పి తనను మిస్ గైడ్ చేశారా అని నాయకులను బాబు నిలదీశాడని తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేయడం రాజకీయంగా సంచలనమైంది.
ప్రతిపక్ష వైసీపీకి చెందిన విజయసాయి ట్వీట్ ను టీడీపీ నేతలు, జనాలు అంత బలంగా నమ్మే పరిస్థితి లేకున్నా.. మంగళగిరి క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం టీడీపీకి అనుకూలంగా లేవని సమాచారం. మంగళగిరి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణా రెడ్డి జనంతో మమేకం అవుతూ గట్టి పోటీనిస్తున్నారు. నియోజకవర్గంలో ఇటీవల చేసిన సర్వేలు , పరిశీలకుల అధ్యయనంలో కూడా గెలుపు వైసీపీదేనంటున్నాయట..
దీంతో కొడుకు లోకేష్ ను తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో దింపి గెలిపించాలని చూస్తున్న చంద్రబాబు ఆశలు తీరేలా కనిపించడం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. అనవసరంగా లోకేష్ ను మంగళగిరి బరిలో దింపామా అని టీడీపీ శిబిరం గుబులు చెందుతోందట.. చూడాలి మరి ఏం జరుగుతుందో..