Begin typing your search above and press return to search.
మనుషుల ప్రాణాలు పోయాక 'స్పందిస్తారా?': చంద్రబాబు ఫైర్
By: Tupaki Desk | 2 Nov 2022 2:30 PM GMTఏపీ ప్రభుత్వంపైనా. ముఖ్యమంత్రి జగన్‌పైనా మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న `స్పందన` కార్యక్రమాన్ని ఆయన టార్గెట్ చేశారు. కేవలం ప్రచారానికే పరిమితమైన స్పందన కార్యక్రమం ఎందుకు?, మనుషుల ప్రాణాలు పోయాక స్పందిస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు.
తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర ఆత్మహత్యాయత్నం చేసిన మహిళను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయం కోసం ఆత్మహత్యాయత్నం చేయడం బాధాకరమని, సామాన్యులపై జరుగుతున్న వేధింపులకు ముగింపు ఎప్పుడు? అని ప్రశ్నించారు. కుమార్తె వైద్యానికి ఇంటిని అమ్మే స్వేచ్ఛ లేకపోవడం దారుణమన్నారు.
మహిళ ఆరోపణలు చేసిన మంత్రి గన్‌మెన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో మహిళ ధర్నా చేసినప్పుడే చర్యలు తీసుకుంటే ఇంతవరకు వచ్చేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు.సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర ఓ మహిళ ఓ మహిళ చేయి కోసుకోసుకుని కలకలం రేపిన విషయం తెలిసిందే.
కాకినాడ జిల్లాకు చెందిన తల్లీ, కూతుళ్లు సాయం కోసం సీఎం నివాసానికి వచ్చారు. అయితే తక్షణ సాయంపై స్పష్టమైన హామీ అందకపోవడంతో తల్లి ఆరుద్ర చేయి కోసుకుంది. తల్లీ, కూతుళ్లు ఇద్దరూ కాకినాడ గ్రామీణ మండలం రాయుడు పాలెం వాసులు. కుమార్తె సాయి లక్ష్మీ చంద్ర పుట్టుకతోనే వెన్నెముక సమస్యతో బాధపడుతోంది. కుమార్తె వైద్యం కోసం అన్నవరంలోని ఇంటిని అమ్మేందుకు ఆరుద్ర ప్రయత్నం చేస్తోంది.
అయితే పక్కన ఉండే కానిస్టేబుల్ ఇంటిని అమ్మనివ్వకుండా అడ్డుపడుతున్నరంటూ ఆరోపించారు. రూ.40 లక్షల ఇంటిని రూ.10 లక్షలకు తమకే అమ్మాలంటున్నారంటూ ఆరుద్ర ఆవేదన వ్యక్తం చేశారు. వారికి పోలీసు ఉన్నతాధికారులు సహకరిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో తమ గోడును చెప్పుకునేందుకు సీఎం నివాసానికి వచ్చిన ఆరుద్ర... స్పందనలో ఫిర్యాదు చేసి తిరిగి వెళుతూ బ్లేడ్‌తో చేయికోసుకుంది. వెంటనే అప్రమత్తమైన క్యాంపు కార్యాలయం భద్రతా సిబ్బంది.. మహిళను ఆసుపత్రికి తరలించారు. దీనిపై చంద్రబాబు వెంటనే స్పందించారు. ప్రభుత్వం కళ్లు మూసుకుని పనిచేస్తోందని, తన వారిని కాపాడుకునేందుకు, తన వారికి ఆస్తులు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.