Begin typing your search above and press return to search.
కొండలు కొట్టేస్తున్నారు.. : జగన్ టీంపై చంద్రబాబు ఫైర్
By: Tupaki Desk | 13 July 2022 3:30 PM GMTఏపీ అధికార పార్టీ వైసీపీపై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. నిన్నటి వరకు మట్టి, నీరు దోచేసిన జగన్ టీం.. ఇప్పుడు కొండలను కూడా కొల్లగొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి గ్యాంగ్ కొండల్ని చెరువులుగా చేసేసిందని ధ్వజమెత్తారు. కొండల్ని ఏ విధంగా పెంచుతారంటూ న్యాయస్థానం సైతం ప్రశ్నించిందని చంద్రబాబు గుర్తు చేశారు. చారిత్రాత్మక విశాఖ రుషికొండను కనుమరుగు చేయటం బరితెగింపేనని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా అడవుల నరికివేతపై 75 ఘటనలు తన దృష్టికి వచ్చాయన్నారు.
పద్ధతి ప్రకారం ఇసుక తవ్వకాలు చేపట్టకుండా వాతావరణ సమస్యలకు తెరలేపారని దుయ్యబట్టారు. వ్యక్తులు ముఖ్యం కాదు.. సమాజమే శాశ్వతమని వెల్లడించారు. పర్యావరణాన్ని కాపాడకుండా అడవుల్ని నాశనం చేస్తే భవిష్యత్తు తరాలకు తీవ్ర ముప్పేనని హెచ్చరించారు. ప్రకృతి నాశనమయ్యేలా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారు.ప్రకృతి విలయ తాండవం చేస్తే తట్టుకోలేం. మైనింగ్ మంత్రే అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు. అక్రమాలు ప్రశ్నిస్తున్న నాపై కేసులు పెడుతున్నారు. ఇసుక మాఫియా వల్ల అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిందని ధ్వజమెత్తారు.
60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని చంద్రబాబు అన్నారు. భారతి సిమెంట్స్ కోసం బమిడికలొద్దిలో లాటరైట్, బాక్సైట్ తవ్వకాలు జరుపుతున్నారని తెలిపారు. కొండల్ని, చెరువుల్ని అక్రమంగా తవ్వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలోనూ ఇదే తరహాలో వైసీపీ అక్రమ మైనింగ్ జరుపుతోందని చెప్పారు. అక్రమ తవ్వకాలపై సీఎస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తుపానులు రాకుండా మడ అడవులు సహాయపడతాయని, కాకినాడలో అలాంటి మడ అడవులను నాశనం చేస్తున్నారని అన్నారు. ``భవిష్యత్ తరాల కోసమే నా యుద్ధం.. సమాజానికి చెడు చేసే వ్యక్తులతోనే నా పోరాటం. `` అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీల నిర్మాణంపై జోనల్ ఇన్‌ఛార్జ్‌లతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. క్లస్టర్ ఇన్‌ఛార్జ్ నియామకాలు కాని 30 నియోజకవర్గాలపై దృష్టి సారించి, వారం రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో క్లస్టర్, యూనిట్ నియామకాలు పూర్తి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా బూత్ కమిటీల నియామకం ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలన్నారు. ఆగస్టు మొదటి వారం నుంచి 15వ తేదీలోపు సెక్షన్ల నియామకం పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు.
ఇందుకోసం జోనల్ ఇన్‌ఛార్జ్‌లు సంబంధిత జోనల్ నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని.. నిర్దేశిత సమయంలోపు కమిటీల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో జోన్-1 ఇన్‌ఛార్జ్ బుద్ధా వెంకన్న, జోన్-2 ఇన్‌ఛార్జ్ ప్రత్తిపాటి పుల్లారావు, జోన్-3 ఇన్‌ఛార్జ్ డోలా బాలవీరాంజనేయస్వామి, జోన్-4 ఇన్‌ఛార్జ్ అనగాని సత్యప్రసాద్, జోన్-5 ఇన్‌ఛార్జ్ అమర్నాథ్ రెడ్డిలకు పలు ఆదేశాలు ఇచ్చారు.