Begin typing your search above and press return to search.

అసెంబ్లీ లో అగ్గి రాజేసిన మార్షల్స్ ... బాస్టర్డ్ అంటూ బాబు అసహనం !

By:  Tupaki Desk   |   13 Dec 2019 5:31 AM GMT
అసెంబ్లీ లో అగ్గి రాజేసిన మార్షల్స్ ... బాస్టర్డ్ అంటూ బాబు అసహనం !
X
తాజాగా ఏపీ లో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజు నుండే సభలో వైసీపీ -టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ అసలు సమస్యలని గాలికొదిలేస్తున్నారు. ప్రభుత్వం పై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్న టీడీపీ నేతలు ప్రతి దాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూస్తూ ప్రభుత్వం చేసేవన్నీ తప్పు అంటూ ఊదరగొడుతున్నారు. దానికి ప్రభుత్వ పక్ష నేతలు కూడా కొంచెం గట్టిగానే సమాధానం ఇస్తున్నారు.

ఇకపోతే గురువారం మీడియాపై నియంత్రణ విధిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై నిన్న టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఆ తర్వాత నిరసన వ్యక్తం చేసేందుకుగాను చంద్రబాబు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి అసెంబ్లీ కి పాదయాత్ర గా వచ్చారు. ఆ సమయంలో వారి చేతుల్లో ప్లకార్డులు, బ్యానర్లు..బ్యాడ్జీలు ఉండటంతో మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. దీంతో అసెంబ్లీ గేటు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ నేతలు మార్షల్స్‌తో వాగ్విద్వానికి దిగారు. ఈ సమయంలో సంయమనం కోల్పోయిన చంద్రబాబు నోరు జారారు. మార్షల్స్‌ని బాస్టర్డ్ అంటూ దూషించారు.

అసెంబ్లీ లో ఈ మార్షల్స్ వ్యవహారం పెద్ద దుమారం రేపుతోంది. మార్షల్స్ మమ్మల్ని ఎమ్మెల్యేలుగా చూడటం లేదు అని టీడీపీ వాదిస్తుంటే .. అసెంబ్లీ లోకి ఎలా పడితే ఆలా రావడానికి కుదరదు. అందరికి ప్రత్యేక దారులు ఉన్నాయి కదా.. కానీ చంద్రబాబు... అలా ప్రవేశించకుండా... కాలినడకన, ఊరేగింపుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు కానివాళ్లు, తన బ్లాక్ క్యాట్ కమేండోలతో కలిసి ఓ ర్యాలీగా వచ్చి... ఎమ్మెల్యేలు వచ్చే గేటులోంచి అసెంబ్లీలోకి రావాలని ప్రయత్నించడంతో గందరగోళం తలెత్తిందని అన్నారు. ఆ సమయం లో... సహజంగా ఎవరు సభ్యులో ఎవరు సభ్యులు కారో తెలుసుకునేందుకు మార్షల్స్ కొన్ని రూల్స్ ఫాలో అవుతూ సభ్యుల్ని మాత్రమే లోపలికి రానిచ్చారని సీఎం జగన్ చెప్పారు అన్నారు. అలాగే మార్షల్స్ ని తీవ్ర పదజాలం తో దూషించడం పద్దతి కాదు అని చెప్పారు.