Begin typing your search above and press return to search.
బాబు తొలి ఎన్నికల హామీ సూపర్ హిట్
By: Tupaki Desk | 25 Nov 2022 2:51 PM GMTవచ్చే ఎన్నికల కోసం అన్ని వర్గాలను మంచి చేసుకునే పనిలో టీడీపీ అధినాయకత్వం పడింది. ఈ మధ్య టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటనలకు, ఆయన సభలకు జనాలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దాంతో బాబులో ఉత్సాహం కట్టలు తెంచుకుంటోంది. ఈసారి కచ్చితంగా అధికారం తమదే అన్న నిబ్బరం కూడా ఆయనకు కలుగుతోంది.
దాంతో ఇపుడు ఆయన ఎన్నికల హామీలను కూడా ఇస్తున్నారు. అలా ఫస్ట్ ఎన్నికల హామీని ఆక్వా రైతులకే బాబు ఇచ్చారు. తమ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో వస్తే విద్యుత్ ని యూనిట్ కొ ఒక రూపాయికే ఇస్తామని అక్వా రైతుల సదస్సులో చంద్రబాబు ప్రకటించేశారు. ఇది నిజంగా ఆక్వా రైతులకు వరం లాంటిదే అని చెప్పాలి.
ఆక్వా రైతులు ఈ విషయం మీద చాలా కాలంగా ఆందోళన పడుతున్నరు. సరైన సమయంలో వారి మనసెరిగి చంద్రబాబు ఈ హామీ ఇచ్చేశారు అని అంటున్నారు.ఇదిలా ఉంటే చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చినపుడు విద్యుత్ ధర యూనిట్ కి 4.86 రూపాయలుగా ఉంది. దానికి చంద్రబాబు యూనిట్ ధరను రెండు రూపాయలు చేశారు.
ఆ టైం లో విపక్షంలో ఉన్న జగన్ తాము అధికారంలోకి వస్తే ఇంకా తక్కువ ధరకే ఇస్తామని చెప్పారు. కానీ వైసీపీ ప్రభుత్వం జోనల్ వ్యవస్థలను తీసుకొచ్చింది. దాని వల్ల చవకగా దక్కే విద్యుత్ ప్రయోజనం అక్వా రైతులకు ఇరవై శాతం మాత్రమే అందుబాటులో ఉంది. దీనిని గమనించిన చంద్రబాబు ఇపుడు ఈ హామీని ఇచ్చి ఆక్వా రైతులను మంచి చేసుకున్నారు అని అంటున్నారు.
ఒక విధంగా ఇది సాహసంతో కూడుకున్న ఎన్నికల హామీగా చూస్తున్నారు. ఆక్వా రైతులకు కావాల్సింది ఇదే. ఆక్వా రైతాంగం గోదావరి జిల్లాలలో పెద్ద ఎత్తున ఉన్నారు. వారు బాబు ఎన్నికల హామీని విశ్వసిస్తే మాత్రం కచ్చితంగా అది టీడీపీకి భారీ ఎత్తున రాజకీయ లాభాన్ని చేకూరుస్తుంది అనడంతో సందేహం లేదు. మరి అధికారంలో ఉన్న వైసీపీ దీనికి విరుగుడుగా ఏం చేస్తుంది అన్నది కనుక ఆలోచిస్తే ఏం చేసినా ముందుగా చంద్రబాబు ప్రకటించారు కాబట్టి ఆ మైలేజ్ ఆయనకే ఉంటుంది అంటున్నారు.
మరో వైపు చూస్తే ఏపీలో రైతులకు మరిన్ని హామీలు ఇచ్చే దిశగా ఎన్నికల ప్రణాళికను పకడ్బంధీగా టీడీపీ రూపొందిస్తోంది అని అంటున్నారు. గతంలో చేసిన తప్పులను మరోసారి రిపీట్ చేయకుందా జాగ్రత్త పడుతున్నారు అని అంటున్నారు. గతంలో దూరమైన వర్గాలను ఇపుడు దరి చేర్చుకుంటూ వారికి తన పట్ల నమ్మకాన్ని పెంచే విధంగా బాబు వ్యవహరిస్తున్నారు. రానున్న రోజుల్లో బాబు నోటి నుంచి మరిన్ని వరాల మూటల లాంటి మాటలు బయటకు వస్తాయని అంటున్నారు. మొత్తానికి ఎన్నికల హామీలతో బాబు 2024 ఎన్నికలకు రెడీ అయిపోయినట్లే అని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.