Begin typing your search above and press return to search.
జగన్ హామీలన్నీ!... బాబు అమలు చేస్తున్నారే!
By: Tupaki Desk | 21 Jan 2019 9:22 AM GMTనారా చంద్రబాబునాయుడు... టీడీపీ అధినేతగానే కాకుండా నవ్యాంధ్రప్రదేశ్ కు సీఎంగా కూడా వ్యవహరిస్తున్నారు. అంతేనా 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని జబ్బలు చరుచుకుంటున్న నేతగా తనను తాను దేశంలోనే సీనియర్ మోస్ట్ పొలిటిషన్ గా చిత్రీకరించుకోవడంలోనూ ఆయనకు ఆయనే సాటి. డాంబికాలకు ఏమాత్రం కొదవ లేని నేతగా, నిత్యం సెల్ఫ్ డబ్బాలు కొట్టుకునే నేతగా చంద్రబాబు తనపై తాను ఓ గట్టి ముద్ర వేసుకున్నారనే చెప్పాలి. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న సమయంలో వ్యవసాయం దండగంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు... దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన చూశాక... రైతు జపం అందుకోకుంటే పప్పులు ఉడకవని అనుభవం రీత్యా అవగతం చేసుకుని తనను తాను మలచుకున్న నేతగా కూడా చంద్రబాబు జనాలకు గుర్తుండిపోతారు. పోనీ... ఆ మార్పు తర్వాత అయినా చంద్రబాబు రైతులకేమైనా మేలు చేశారా? అంటే... భూతద్దం వేసి వెతికినా కించిత్ ప్రయోజనం కూడా దక్కదనే చెప్పక తప్పదు. వైఎస్ జమానాతో దిమ్మతిరిగిపోయిన చంద్రబాబు... వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు, రాజకీయాల్లో చాలా తక్కువ అనుభవం ఉన్న నేతగా టీడీపీ నేతలు తక్కువ చేసి మాట్లాడే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చూసి మరింత నేర్చుకునేందుకు సిద్ధపడక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
పాలిటిక్స్ లో తనకంటూ తిరుగు లేదని చెప్పుకునే చంద్రబాబు... ఎన్నికల్లో గెలుపును మాత్రమే కాంక్షిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పాలన ఎలా అందిస్తానన్న విషయాన్ని తెలియజేస్తూ జగన్ రూపొందించిన నవరత్నాలు, పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఇప్పుడు చంద్రబాబుకు అక్కరకొస్తున్నాయి. విజయం కోసం ఎంతదాకా అయినా వెళ్లే వైజం చంద్రబాబుది అయితే...అబద్ధపు హామీలతో వచ్చే అధికారం తనకు వద్దంటూ సీఎం కుర్చీని వదిలేసుకున్న ధీరోదాత్తత జగన్ సొంతం. ఇక్కడే జగన్... చంద్రబాబుకు ఆదర్శప్రాయుడయ్యారని చెప్పాలి. ఇక్కడ చంద్రబాబు తీసుకున్న ఆదర్శం ఏమిటంటే... జగన్ లా స్పష్టతతో కూడిన హామీలివ్వడం కాదు. కేవలం ఎన్నికల జిమ్మిక్కుల కోసం... ప్రజల ఓట్లను లాగేసేందుకు జగన్ చేసిన ప్రకటనలను అప్పటికప్పుడు అమల్లోకి తీసుకురావడమన్న మాట. ఎన్నికలు ముగిసేదాకా ఓ మాట... ఎన్నికలు అయిపోయిన తర్వాత మరోమాటగా చంద్రబాబు నైజం మనకు తెలిసిందే కదా. ఆ క్రమంలోనే ఇప్పటికే నవరత్నాల్లో రైతుకు ప్రభుత్వ పెట్టుబడిని జగన్ ప్రకటిస్తే... దానిని పూర్తిగా కాపీ కొట్టేసిన చంద్రబాబు రైతు రక్ష పేరిట ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. నేటి కేబినెట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకోనున్న చంద్రబాబు సర్కారు... ఎన్నికల ముందు ప్రజల ఓట్లను కొల్లగొట్టేందుకు రైతులకు సర్కారీ పెట్టుబడిని అందజేయనుంది.
అంతేనా... ఆటో డ్రైవర్లు తలెత్తుకుని బతికేలా, ఆర్థిక ఇబ్బందుతలతో సతమతం కాకుండా ఉండేందుకు ఆటోలపై లైఫ్ ల్యాక్స్ ను ఎత్తివేయడంతో పాటుగా ప్రతి ఆటో డ్రైవర్‌కు ఏడాదికి రూ.10 వేలు ఇస్తానని జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే కదా. ఈ ప్రకటనకు ఆటో డ్రైవర్ల నుంచి మంచి స్పందన లభించింది. ఇంకేముంది... దీనిని కూడా కాపీ కొట్టేసిన చంద్రబాబు... నేటి కేబినెట్ భేటీలో ఆటోలతో పాటు ట్రాక్టర్లకు కూడా లైఫ్ ట్యాక్స్ ఎత్తివేస్తున్నట్లుగా నిర్ణయం తీసుకోనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంటే... జగన్ నోట హామీ రావడమే ఆలస్యం... పరాజయం తప్పదని బెంబేలెత్తిపోతున్న చంద్రబాబు... దానిని అమలు చేసుకుంటూ పోతున్నారన్న మాట. ఈ లెక్కన రాష్ట్రంలో సంక్షేమ రాజ్యానికి బాటలు వేసుకుంటూ జగన్ సాగుతుంటే... ఎక్కడ తనను ఓటమి వరిస్తుందోనన్న భయంతో చంద్రబాబు దానిని అమలు చేసుకుంటూ పోతున్నారన్న మాట. మొత్తంగా సంక్షేమం విషయంలో చంద్రబాబు... పూర్తిగా జగన్ బాటలోకి రాక తప్పలేదన్న మాట. ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తుంటే... విపక్ష నేతగా ఉండి కూడా జగన్ రాష్ట్రంలో సరికొత్త సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టేస్తున్నారన్న మాట. సో... అధికార పక్షాన్ని సంక్షేమం బాటలోకి లాగేసిన జగన్ ఈజ్ గ్రేట్ అన్న మాటేగా.