Begin typing your search above and press return to search.
ఏపీ అసెంబ్లీ లో బాబు గారి ఆసక్తికర సీన్
By: Tupaki Desk | 10 Dec 2019 6:14 AM GMTచంద్రబాబు ను ఈ వేషం లో చూసి ఏపీ అసెంబ్లీ ఎమ్మెల్యేలంతా ఆశ్చర్య పోయారు.. చంద్రబాబేనా అని ముక్కున వేలేసుకున్నారు. ఉమ్మడి ఏపీని చాలా రోజులు పాలించిన చంద్రబాబు ఏనాడు రైతుల సమస్యలు పట్టించుకోలేదన్న విమర్శ ఉంది. 2004కు ముందు చంద్రబాబు హయాం లో కరువు కరాళ నృత్యం చేసి రైతుల ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. నాడు హైటెక్ సీఎంగా సాఫ్ట్ వేర్ , పరిశ్రమల వైపు బాబు పయనించారు తప్పితే రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు.
ఇక 2014లో రాష్ట్రం విడిపోయాక కూడా అమరావతి రాజధాని బిల్డప్ లు, కియా సహా ఇతర పరిశ్రమలకు పెద్ద పీట వేసి రైతాంగాన్ని గాలికి వదిలేశారన్న విమర్శ ఉంది. అందుకే ఒకసారి గెలిపించాక చంద్రబాబును మరోసారి గెలిపించడానికి జనాలు సాహసించడం లేదు. రైతులంటేనే అస్సలు పడని.. ఆమడ దూరం ఉండే చంద్రబాబు తాజాగా నెత్తిన వరి గడ్డి పెట్టుకొని అచ్చం రైతు వేశారు. అలానే ఏపీ అసెంబ్లీ కి తరలిరావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
అసెంబ్లీ సమావేశాల రెండో రోజు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తొలి రోజు ఉల్లిధరలపై ఆందోళన చేసిన చంద్రబాబు.. టీడీపీ ఎమ్మెల్యేలు మెడలో ఉల్లిగడ్డల దండలు వేసుకొని అసెంబ్లీకి వచ్చారు.
ఇక రెండోరోజు పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని.. వరి గడ్డి మోపులు, పత్తి చెట్లు, పామాయిల్ గెలలను తలపై పెట్టుకొని అసెంబ్లీకి చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు ర్యాలీగా వచ్చారు. అసెంబ్లీలో రైతుల సమస్యలను, గిట్టుబాటు ధరలపై టీడీపీ వాయిదా తీర్మానం కూడా ఇచ్చారు.