Begin typing your search above and press return to search.
జగన్, పవన్ వేగం!.. స్లో మోషన్ లో బాబు!
By: Tupaki Desk | 10 March 2019 3:04 PM GMTసార్వత్రిక ఎన్నికలతో పాటు తెలుగు నేలలో కీలక ఎన్నికలుగా భావిస్తున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కూడా కాసేపటి క్రితం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. సెలవు రోజు అయినప్పటికీ.. ఆదివారం సాయంత్రం షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ... ఎన్నికలకు సంబంధించి సమగ్ర సన్నద్ధతను ప్రకటించింది. ఎప్పుడెప్పుడు ఎన్నికలు జరుగుతాయా?... టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని ఎప్పుడెప్పుడు ఏపీ సీఎం పీఠం నుంచి దించేస్తామా? అంటూ ఎదురు చూస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... షెడ్యూల్ చాలా క్విక్ గానే స్పందించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే తన పార్టీ వైసీపీ ట్విట్టర్ అకౌంట్ ద్వారా స్పందించిన జగన్... ఎన్నికలకు తాను సర్వసన్నద్ధంగా ఉన్నట్టుగా ప్రకటించేశారు. ఎన్నికలకు సమర శంఖం పూరిస్తున్న ఫొటోను పోస్ట్ చేసిన వైసీపీ... ఎన్నికల నగారా పోస్ట్ ను కూడా పోస్ట్ చేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిందని, ఏప్రిల్ 11న రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయనిని ఆ పోస్టులో పేర్కొంది. అంతేగాకుండా, మాటతప్పని, మడమతిప్పని విశ్వసనీయతకు ఒక అవకాశం ఇద్దాం అంటూ ఆ పోస్టులో జగన్ తనదైన మార్క్ ట్వీట్ ను పోస్ట్ చేశారు.
ఇక పార్టీ పెట్టి ఐదేళ్లు గడిచిన తర్వాత ఎన్నికలకు సిద్ధమైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తాను కూడా ఎన్నికలకు సర్వసన్నద్ధంగానే ఉన్నట్లు ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన వెంటనే ఈ మేరకు ఆయన జనసేన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. నిశ్శబ్ద విప్లవం మొదలైందని, పాతిక కిలోల బియ్యం కోసం కాదు, పాతిక సంవత్సరాల భవిష్యత్తు కోసం అనే నినాదంతో జనసేన అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు ప్రత్యక్షమైంది. షెడ్యూల్ ప్రకటన మీడియాలో వచ్చిన వెంటనే, జనసేన ట్విట్టర్ అకౌంట్ లో ఎన్నికల పోరుకు సేన సిద్ధం అనే ట్వీట్ వెలువడింది. అయితే ఏపీలో అధికారపక్షంగా ఉన్న టీడీపీ మాత్రం ఎన్నికల షెడ్యూల్ పై స్పందించేందుకు చాలా సమయమే తీసుకుంది. షెడ్యూల్ విడుదలైన దాదాపు మూడు గంటలకు గానీ స్పందించని ఆ పార్టీ అధినేత చంద్రబాబు... తన ట్విట్టర్ ఖాతాలో షెడ్యూల్ ను స్వాగతిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
*2019 ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభ - అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఓటు వేయడం మన హక్కు, ప్రతి ఒక్కరు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఓటరు లిస్టులో తమ పేరు ఉందో లేదో చూడాలి. లేకపోతే ఫారం 6 ద్వారా వెంటనే చేర్పించుకోవాలి. ఓటు దొంగలు మీ ఓటు తొలగించకుండా కాపాడుకుంటూ, ఓటు వేసే ముందు ఐదేళ్ల రాష్ట్ర భవిష్యత్తును, మీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మీతరంతో పాటు మీ బిడ్డల తరం, వారి బిడ్డల తరం వరకూ ఆలోచించి పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను* అంటూ రెండు వరుస ట్వీట్లు పెట్టేశారు. మొత్తంగా షెడ్యూల్ విడుదల కాగానే... జగన్ తో పాటు పవన్ కూడా స్పీడును చూపిస్తే... చంద్రబాబు మాత్రం స్లో మోషన్‌నే ఆశ్రయించారని చెప్పాలి.