Begin typing your search above and press return to search.
జల వివాదం వేళ రెండు కళ్ల సిద్ధాంతాన్ని బాబు మర్చిపోయారా?
By: Tupaki Desk | 16 July 2021 3:54 AM GMTరెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీ అంతకంతకూ హీటెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వేళలో పెద్ద మనిషిగామాట్లాడాల్సిన మాజీ ముఖ్యమంత్రి.. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మౌనంగా ఉండటాన్ని ఏమనాలి? తాజాగా ఆయన నోరు విప్పిన బాబు.. సమస్యకున్న పరిష్కారాన్ని సూచించటం మానేసి.. రాజకీయ వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాలు తనకు రెండు కళ్లు లాంటివని.. వాటిల్లో ఏ కంటికి ఇబ్బంది కలిగినా తనకు నొప్పేనంటూ గతంలో వీరావేశంతో చేసిన వ్యాఖ్యల్ని తాజాగా చంద్రబాబు మర్చిపోయారా? అన్నదిప్పుడు ఆసలు ప్రశ్నగా మారనుంది.
గతంలో బాబు చెప్పిన మాటలే నిజమైనప్పుడు.. రెండు తెలుగు రాష్ట్రాల క్షేమంపై ఆయనకు కమిట్ మెంట్ ఉండి ఉంటే.. రెండు తెలుగు రాష్ట్రాల మద్య నెలకొన్న వివాదానికి చెక్ పెట్టేలా.. ఏ రాష్ట్రం ఎలా తప్పు చేస్తుందన్న విషయాన్ని పెద్ద మనిషి తరహాలో బయటపెట్టొచ్చు కదా? అదేమీ లేకుండా.. రోటీన్ రొడ్డు కొట్టుడు డైలాగులకు పరిమిత కాకుండా ఉండాల్సింది. అయితే.. అలాంటి వాటిని చేపట్టని బాబు.. ఎప్పటిలానే జగన్ ను తిట్టటానికి.. ఆయన మీద ఘాటు ఆరోపణలు చేయటానికే సమయాన్ని వెచ్చిస్తున్నారు తప్పించి.. సమస్యకు పరిష్కారం చూపించే విషయంలో ముందుకు రాకపోవటంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద చంద్రబాబు తరచూ విమర్శలు చేయటం తెలిసిందే. అలాంటి ఆయన తాజాగా నెలకొన్న నీటి లొల్లిపై మాత్రం మౌనంగా ఉంటున్నారు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉండటం చూస్తే.. పలు అనుమానాలు తలెత్తక మానదు. తాను మౌనంగా ఉంటూ.. తన నేతల చేత మాట్లాడిస్తున్న చంద్రబాబు తీరు చూస్తే.. ఏపీ ప్రయోజనాల కోసం ఆయనేం మాట్లాడరా? అన్న సందేహం కలుగక మానదు. తాజాగా తెలుగు తమ్ముళ్లు సీఎం జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ఇన్ని మాటలు మాట్లాడుతున్న వారు.. తమ అధినేత స్టాండ్ ఫలానా అని.. సమస్య పరిష్కారానికి ఉన్న మార్గాల్ని సూచన చేయొచ్చు. కానీ.. అలాంటివేమీ చేయకుండా కేవలం.. తిట్టిపోయటమే ఎజెండా అన్నట్లుగా వ్యవహరించటం గమనార్హం.
ఏపీ హక్కుల్ని తెలంగాణ హరిస్తుందని.. వైసీపీ చేతిలో 30 మంది ఎంపీలు ఉన్నారని.. నీటి హక్కును పక్క రాష్ట్రం హరిస్తుంటే మాట్లాడకుండా కేంద్రానికి ఉత్తరాలు రాస్తే సరిపోతుందా? అని ప్రశ్నిస్తున్నారు. జలవివాదంపై ప్రత్యేక విమానాన్ని వేసుకొని ఢిల్లీకి వెళ్లి.. ఎందుకు మాట్లాడరని ప్రశ్నిస్తున్నారు. ‘కేసుల కోసం ప్రత్యేక విమానం వేసుకొని ఢిల్లీకి వెళ్లినట్లుగా.. జలవివాదం మీద ఎందుకు వెళ్లరు? 30 మంది ఎంపీల్ని పెట్టుకొని ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్న వారు.. తమ అధినేత చంద్రబాబు మౌనం వెనుక కారణాన్ని కూడా చెప్పి ఉంటే బాగుండేదన్న మాట వినిపిస్తోంది.
‘టీడీపీ హయాంలో రాని సమస్యలు ఇప్పుడెందుకు వస్తున్నాయి? ఇద్దరు ముఖ్యమంత్రులూ సఖ్యతతో ఉన్నా జలవివాదం ఎందుకు పరిష్కారం కావడం లేదు? కూర్చుని మాట్లాడుకోండి. పరిష్కారం కాకపోతే అపెక్స్ కౌన్సిల్‌లో చర్చించండి.. చంద్రబాబు ఎందుకు మాట్లాడడం లేదని కొందరు వైసీపీ నేతలు అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ మాట్లాడరు గానీ.. చంద్రబాబు మాట్లాడాలా? తనకు ఆ దమ్ము లేదని.. చేతగాదని జగన్ చెబితే చంద్రబాబు వెళ్లి సాధించుకొస్తారు’ అంటూ టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల్ని చూస్తే.. టీడీపీ ఏం కోరుకుంటుంది? టీడీపీ అధినేత ప్లానింగ్ ఏమిటన్నది ఇట్టే అర్థమవుతుంది. సమస్యలో ఉన్న వేళలో.. చొరవ తీసుకొని అడుగు వేయటం మానేసి.. అదే పనిగా ప్రతి విషయాన్ని రాజకీయం చేయటంలో అర్థం లేదన్న మాట వినిపిస్తోంది.