Begin typing your search above and press return to search.

ముసుగు ఉద్య‌మాలు వ‌ద్దంటున్న బాబు గారు

By:  Tupaki Desk   |   25 Dec 2019 11:10 AM GMT
ముసుగు ఉద్య‌మాలు వ‌ద్దంటున్న బాబు గారు
X
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో...తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఏపీలో మూడు రాజ‌ధానులు ఏర్పాటు కావ‌చ్చున‌ని సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌టించడం, జీఎన్‌రావు క‌మిటీ సైతం నివేదిక ఇవ్వ‌డం ... తెలిసిన సంగ‌తే. దీనిపై స‌హ‌జంగానే తెలుగుదేశం పార్టీ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. మూడు ప్రాంతాల్లో మూడు అంశాల్లో రాజ‌ధానులు ఎందుక‌ని ప్ర‌శ్నిస్తోంది. మ‌రోవైపు అమ‌రావ‌తి లో ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నాయి. ఈ స‌మ‌యంలో ఏపీ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

మూడు రాజ‌ధానుల విష‌యంలో అమ‌రావ‌తి ప్రాంతంలో ఆందోళ‌నలు జ‌రుగుతుండ‌గా...వారెవ‌రూ రైతులు కాద‌ని... టీడీపీ కార్యక‌ర్త‌ల‌ని విప‌క్ష వైసీపీ ఆరోపిస్తోంది. అయితే, తాజాగా ఏపీ సీఎం చంద్ర‌బాబును కొంద‌రు రైతుల‌, అమ‌రావ‌తి ప్రాంత వాసులు క‌లిశారు. రాజ‌కీయ పార్టీల కంటే, సొంతంగా ఉద్య‌మాలు చేయ‌డం మేల‌ని వారికి తెలిపారు. ఎక్కడిక‌క్క‌డ జేఏసీలుగా ఏర్పాటై ఉద్య‌మించాల‌ని... రాష్ట్రవ్యాప్తంగా క‌లిసిక‌ట్టుగా ముందుకు సాగాల‌ని బాబు తెలిపారు. అంతేకాకుండా, రాష్ట్రప‌తి, ప్ర‌ధాన‌మంత్రికి ఈ విష‌యంలో లేఖ రాయాల‌ని భావిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

అయితే, చంద్ర‌బాబు చేసిన ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో స‌హ‌జంగానే.... తెలుగుదేశం స్పాన్స‌ర్డ్ ఉద్య‌మాల‌పై అభిప్రాయాలు మారిపోనున్నాయి. అంతేకాకుండా, జ‌గ‌న్‌కు సైతం ఈ ప‌రిస్థితి ప‌రీక్ష వంటిదంటున‌నారు. ఒక‌వేళ చంద్ర‌బాబు చెప్పిన‌ట్లు...ప్రాంతాల‌కు అతీతంగా మూడు చోట్లా జేఏసీలు ఏర్పాటై....మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న‌ను వ్య‌తిరేకిస్తే జ‌గ‌న్ మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న జ‌గ‌న్ త‌ప్పుడు నిర్ణ‌యమ‌ని స్పష్ట‌మ‌వుతుందంటున్నారు.