Begin typing your search above and press return to search.

క్విట్ జ‌గ‌న్ సాధ్య‌మేనా ?

By:  Tupaki Desk   |   7 May 2022 12:30 AM GMT
క్విట్  జ‌గ‌న్ సాధ్య‌మేనా ?
X
అనుకుంటే ఏద‌యినా సాధ్య‌మే అని అంటున్నారు టీడీపీ నాయ‌కులు. సాధ్యం కాక‌పోయినా కూడా సాధ్యం అయ్యే వ‌ర‌కూ కృషి చేస్తామ‌ని, శ‌క్తి వంచ‌న లేకుండా శ్ర‌మిస్తామ‌ని కూడా అంటున్నారు టీడీపీ నాయ‌కులు. ఎందుకంటే రాష్ట్రానికి స‌మ‌ర్థ నాయ‌క‌త్వం కావాల‌ని అంటున్నారు టీడీపీ నాయ‌కులు. బాగుంది.. ఇంత వ‌ర‌కూ బాగుంది.. లేట‌ర్ పార్ట్ ఎలా ఉంటుందో చూడాలి. అనుకున్నంత సులువు అయితే కాదు. పార్టీకి జ‌వం మ‌రియు జీవం నింపేది చంద్ర‌బాబే కానీ ఈ సారి ఆస్థాయిలో ఆయ‌నొక్కరే ప‌నిచేయ‌డం అన్న‌ది కుద‌ర‌ని ప‌ని ! అందుకు క్రియాశీల‌క కార్య‌క‌ర్త‌లు కూడా స‌మ‌యాత్తం కావాలి.

గ్రామాల‌లో ఇప్ప‌టికే అధికార పార్టీ ఒత్తిళ్ల‌న్న‌వి విప‌రీతంగా ఉన్నాయి. ఈ త‌రుణాన ప‌సుపు పార్టీ శ్రేణులు పోరాట యోధులు కావాలి, కేసుల‌కు భ‌య‌ప‌డ‌కుండా పోరాట యోధులుగా మిగ‌లాలి అని చెప్పినంత సులువు కాదు. ఈ మాట చంద్ర‌బాబే కాదు ఎవ్వ‌రి నోట నుంచి వ‌చ్చినా అది సులువు కాదు. క‌నుక ఇప్ప‌టికే స్థిర‌ప‌డిపోయిన వైసీపీని క‌ద‌ప‌డం సులువు కాదు. క్విట్ జ‌గ‌న్ అన్న‌ది స్లోగ‌న్ బాగుంది టీడీపీ వ‌ర‌కూ ఆ స్లోగ‌న్ పొలిటిక‌ల్ మానియాకు ప‌నికి వ‌స్తుందే కానీ బాహాటంగా చెప్పాలంటే ఇంకా బాగా ప‌నిచేస్తేనే ఆ స్లోగ‌న్ అన్న‌ది వ‌ర్కౌట్ అవుతుంది. అయితే అధికార పార్టీ వాయిస్ కూడా పెద్ద‌గా బాలేదు.

చంద్ర‌బాబు వ‌చ్చి వెళ్లాక ఆయ‌నొక అస‌మ‌ర్థుడు అని స్పీక‌ర్ కొడుకు త‌మ్మినేని నాగ్ అన‌డం అదొక అస‌మ‌ర్థుని అంతిమ యాత్ర అని క‌వితాత్మ‌క రీతిలో చెబుతూ మాట్లాడడం ముఖ్యంగా ఆయ‌న స్థాయికి త‌గ‌ని మాటలు అని టీడీపీ అంటోంది. స్పీక‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో చేప‌ట్టిన బాబు యాత్ర కానీ స‌భ కానీ చాలా బాగా విజ‌య‌వంతం కావ‌డంతో అదే ఉత్సాహంతో టీడీపీ శ్రేణులు ప‌నిచేసేందుకు స‌మాయ‌త్తం అవుతున్న త‌రుణాన ప్ర‌త్య‌ర్థి పార్టీ కి వెర్బ‌ల్ అటాక్ ఇచ్చారు. ఇదే క‌నుక కొన‌సాగే విధంగా ప‌రిణామాలు జరిగితే వైసీపీ పై ఉన్న సానుభూతి కాస్త టీడీపీ వైపు మ‌ర‌ల‌డం ఖాయం. అప్పుడు క్విట్ జ‌గ‌న్ అన్న స్లోగ‌న్ నిజం కావ‌డం కూడా ఖాయం.