Begin typing your search above and press return to search.
బాబు బైట్ : ఎవరి గాలి ఎవరు తీస్తారో ?
By: Tupaki Desk | 29 May 2022 9:33 AM GMTవచ్చే ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నాయి వివిధ రాజకీయ పార్టీలు. ఇందులో భాగంగా వచ్చే ప్రతి అవకాశాన్నీ వాడుకుని, తమకు అనుగుణంగా పరిణామాలను మార్చుకుని ముందుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో రెండ్రోజుల మహానాడు వివిధ వివాదాస్పద వ్యాఖ్యలకు వేదికైంది.
అదే సందర్భంగా ఆసక్తిదాయక వ్యాఖ్యలకూ వేదికైంది. ముఖ్యంగా మహానాడుకు వచ్చే నాయకుల విషయమై పోలీసులు నడుచుకున్న తీరు పైనే విమర్శలు వస్తున్నాయి. తాము చెబుతున్నా వినకుండా వాహనాల టైర్లలో గాలి తీసేశారని, బస్సులకు అద్దెలు చెల్లిస్తామన్నా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాబు మాట్లాడారు. పోలీసులూ మీ గాలి నేను తీసేస్తా అడ్డు రాకండి అని బాబు అన్నారు.
ఇక వచ్చే ఎన్నికల వేళ ఓటర్లకు సంబంధించి ఎవరు ఎటు ఉండనున్నారు అన్నది ఇప్పటి నుంచే చర్చ మొదలయింది. ఎవరు గాలి ఎవరు తీస్తారు అన్నది కూడా ఇప్పటి నుంచే చర్చకు వస్తోంది. ఎందుకంటే అధికార పార్టీలో ఉన్న వైసీపీ కూడా దుందుడుకుగానే ఉంది. విమర్శల విషయమై కానీ లేదా టీడీపీని అడ్డుకునే విషయమై కానీ ఎక్కడా ఆగడం లేదు. తగ్గడం లేదు.
టీడీపీ కూడా వీటన్నింటినీ జనంలోకి తీసుకు వెళ్లగలుగుతోంది. ముఖ్యంగా జన బలం తమకు ఉందని అందుకు మహానాడు ప్రాంగణమే నిదర్శనం అని పదే పదే టీడీపీ డ్రోన్ షాట్లను చూపిస్తోంది. మంత్రుల కన్నా వేగంగా తాము జనంలోకి వెళ్లామని, తాము చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందని అంటూ టీడీపీ నేతలు వైసీపీకి కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తున్నారు.
నెల్లూరు నుంచి వచ్చిన నాయకులు కూడా వైసీపీ ని ఉద్దేశించి భలే మాట్లాడారు. జగన్ తన సొంత కుటుంబాన్నే దూరం చేసుకుంటూ రాజకీయం చేస్తున్నారని, బాణం ఎక్కడని ప్రశ్నిస్తూ షర్మిలను ఉద్దేశించి కూడా కొన్ని మాటలు చెప్పారు. ఏ విధంగా చూసుకున్నా మహానాడు అంతా వైసీపీని విమర్శించేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ సాగింది.
ఇవన్నీ రేపటి వేళ ఏ విధంగా ఎన్నికల్లో ప్రభావితం చేస్తాయో చూడాలిక. మహానాడు అయిపోయిందని వదిలేయక తక్షణమే అధినేత మళ్లీ జిల్లాల పర్యటన చేపడితే ఫలితాలు ఉంటాయన్న మాట కూడా శ్రేణుల నుంచి వినిపిస్తోంది.
బాదుడే బాదుడు కార్యక్రమాన్ని మరింత విస్తృత స్థాయిలో చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వీరంతా అభిప్రాయపడుతున్నారు.ఏ విధంగా చూసుకున్నా వైసీపీకి కొంత అంతర్మథనం ఖాయం. తాము నియంత్రించాలనుకున్నా టీడీపీ శ్రేణులను అడ్డుకోలేకపోయామన్న మాట ఇప్పుడు వైసీపీ నుంచి వినవస్తోంది.