Begin typing your search above and press return to search.

చంద్రబాబు అడ్డంగా బుక్కైయ్యాడే .. ?

By:  Tupaki Desk   |   13 Dec 2019 7:02 AM GMT
చంద్రబాబు అడ్డంగా బుక్కైయ్యాడే .. ?
X
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ..40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చాలా గొప్పగా చెప్పుకుంటారు. దేశ రాజకీయాలలో నాకంటే సీనియర్ లేరు అని చెప్పుకునే బాబు కి .. ..ఇన్నేళ్ల పాటు రాజకీయంగా క్రియాశీలకంగా పని చేస్తున్నప్పటికీ కూడా కనీసం అసెంబ్లీ లోకి ఎలా రావాలో ..ఎలా రాకూడదు కూడా తెలియదా? బాబు గారు ఇప్పుడే ఎమ్మెల్యే గా ఎన్నికై అసెంబ్లీ లోకి రాలేదు. సంపూర్ణ ఆంధ్రప్రదేశ్ లో సీఎం గా ఎక్కువ రోజులు పని చేసారు. అలాగే ప్రతిపక్ష నేతగా కూడా తన భాద్యతలు నిర్వర్తించారు. అలాగే రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేసారు. ప్రస్తుతం మరోసారి ప్రతిపక్ష నేత గా భాద్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా , ప్రతిపక్ష నేతగా భాద్యతలు నిర్వర్తించిన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా రూల్స్ చెప్పాల్సిన పనిలేదు. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ లో చంద్రబాబు నాకు పెద్ద అవమానం జరిగింది అని భాదపడుతున్నారు. కానీ , ఒక ప్రతిపక్ష నేతగా ఉంటూ ఎలా అసెంబ్లీ లోకి రావాలో ..ఏ గేటు నుండి రావాలో కూడా తెలియదా.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయనకి కేటాయించిన గేటు 2 ద్వారా అసెంబ్లీ లోకి ప్రవేశించాలనీ... కానీ చంద్రబాబు... అలా ప్రవేశించకుండా... కాలినడకన... ఊరేగింపుగా... ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు కానివాళ్లు, తన బ్లాక్ క్యాట్ కమేండోలతో కలిసి... ఓ ర్యాలీగా వచ్చి... ఎమ్మెల్యేలు వచ్చే గేటులోంచి అసెంబ్లీలోకి రావాలని ప్రయత్నించడంతో గందరగోళం జరిగింది. ఆ సమయంలో మార్షల్స్ బాబు ని అడ్డుకున్నారు. దీనితో మార్షల్స్ పై కోపంతో తీవ్ర పదజాలం తో రెచ్చిపోయారు. మొత్తం చేసింది బాబు అయితే , మళ్లీ అసెంబ్లీ లోకి వచ్చి నాకు పెద్ద అవమానం జరిగింది అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్తున్నారు.

దీని పై ఏపీ ప్రభుత్వం కొంచెం కఠినంగానే వ్యవహరించ బోతుంది అని తెలుస్తుంది. చంద్రబాబు పై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు స్పీకర్ కోరారు. ఆ సమయంలో బాబు ని జరిగిన వ్యవహారం పై విచారం వ్యక్తం చేయమని చెప్పగా ..దానికి అయన విముఖత వ్యక్తం చేసారు. దీనితో బాబు పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోబోతుంది అని తెలుస్తోంది.