Begin typing your search above and press return to search.

బాబు ఆవేద‌నను అర్ధం చేసుకునే వారు ఉన్నారా...?

By:  Tupaki Desk   |   8 Jan 2022 11:30 AM GMT
బాబు ఆవేద‌నను అర్ధం చేసుకునే వారు ఉన్నారా...?
X
టీడీపీని అధికారంలోకి తీసుకురావాలి. దీనికి ఏదైనా చేయాలి.. ఇదీ.. పార్టీ అధినేత‌గా చంద్ర‌బాబు ఆలోచ‌న. దీనిలో త‌ప్పులేదు. కానీ, ఆయ‌న ఒక్క‌రే ఈ త‌ర‌హా ఆలోచ‌న చేయ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఉందా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. తాజాగా అన్ని జిల్లాల పార్టీ నేత‌లతో చంద్ర‌బాబు స‌మావేశం అయ్యారు. వ‌ర్చువ‌ల్‌గా జ‌రిగిన ఈ స‌మావేశానికి కొంద‌రు హాజ‌రైనా.. మ‌రికొంద‌రు డుమ్మా కొట్టారు. ఇంకొంద‌రు.. ఇత‌ర కార‌ణాల‌తో దూరంగా ఉంటే.. ఎప్పుడూ చెప్పేదే క‌దా! అని మ‌రికొంద‌రు లైట్ తీసుకున్నారు. దీంతో చంద్ర‌బాబు వ్యూహాన్ని ఎవ‌రు అర్ధం చేసుకుంటారు? అనే ప్ర‌శ్న పార్టీలోనే వినిపిస్తోంది.

గ‌తంలో వైసీపీని అధికారంలోకి తీసుకురావాల‌ని..జ‌గ‌న్‌ను సీఎంను చేయాల‌ని.. క్షేత్ర‌స్థాయి కార్య‌క‌ర్త నుంచి పైస్థాయి నాయ‌కుల వ‌ర‌కు ఒక క‌సి క‌నిపించింది. ఇది ఎన్నిక‌ల్లో ఓటుగా మారి. ఆయ‌న‌కు బ‌లా న్ని చేకూర్చింది. అయితే.. ఈ త‌ర‌హా ఆలోచ‌న కానీ,, చంద్ర‌బాబును మ‌రోసారి సీఎంగా కూర్చోబెట్టాల‌నే క‌సి కానీ.. నిజానికి టీడీపీలో క‌నిపించ‌డం లేదు. గాలివాటంగా గెలిస్తే.. గెలిచిన‌ట్టు.. అనేవారు పెరుగుతు న్నారు. దీంతో చంద్ర‌బాబు చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు. చంద్ర‌బాబు చేస్తున్న వ్యాఖ్య‌లు..అనుకున్న రేంజ్‌లో కార్య‌క‌ర్త‌ల్లోకి వెళ్ల‌డం లేదు. ఈ ప‌రిణామం.. పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతోంది.

పార్టీ ఓట‌మి త‌ర్వాత‌.. ఇప్ప‌టి వ‌ర‌కు అనేక మార్లు కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌తో చంద్ర‌బాబు భేటీ అయ్యారు. ఇలా భేటీ అయిన త‌ర్వాత‌..అనేక ఎన్నిక‌లు వ‌చ్చాయి. నిజానికి వారిలో ఉత్తేజం ఉండి ఉంటే.. ఆయా ఎన్నిక‌ల్లో పార్టీ ఎందుకు ఓడిపోయిందనే విష‌యంపై చ‌ర్చ జ‌రిగి ఉండాలి. కానీ, అలా జ‌ర‌గ‌లేదు. మ‌రి ఇప్పుడు కూడా త్వ‌ర‌లోనే 22 మునిసిప‌ల్‌ స్థానాల‌కు త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌ర‌గనున్నాయి.

ఈ నేప‌థ్యం లో చంద్ర‌బాబు హ‌డావుడి చేస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. అంటే.. కేవ‌లం ఎన్నిక‌లు ఉన్న‌ప్పుడు మాత్ర‌మే.. చంద్ర‌బాబు ఇలా చేస్తున్నార‌ని.. లేక‌పోతే.. సైలెంట్ అవుతున్నార‌ని.. పార్టీలోని వ‌ర్గాలు సైతం లెక్క‌లు వేసుకుంటున్నాయి. మ‌రి ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే.. పార్టీకి న‌ష్టం క‌దా? అంటే.. స‌మాధానం చెప్పేవారు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.