Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు పూల బాట...?

By:  Tupaki Desk   |   19 Jan 2022 2:30 PM GMT
చంద్రబాబుకు పూల బాట...?
X
ఏపీలో రాజకీయాలు వేగంగానే మారుతున్నాయి. అనుకున్నట్లుగానే విపక్షానికి జోష్ కలిగించేలాగానే అన్ని కీలక పరిణామాలు ఉన్నాయని చెబుతున్నారు. ఏపీలో 151 సీట్లతో జగన్ అధికారంలోకి వచ్చినపుడు కనీసం రెండు టెర్ములు ఆ సర్కార్ కన్ఫర్మ్ అని టీడీపీ సహా అంతా అనుకున్నారు. దాంతో అన్ని పార్టీలు డీలా పడ్డాయి కూడా అయితే కాలం గడచే కొద్దీ ఆశలు పెరుగుతూ వస్తున్నాయి. 2021 రెండవ అర్ధ భాగం నుంచి చూస్తే వైసీపీ సర్కార్ మీద వ్యతిరేకత మెల్లగా పెరుగుతూ వస్తోంది.

దానికి ప్రభుత్వ పెద్దల దూకుడు చర్యలు, వారు ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలు కూడా కారణం అని చెప్పాలి. కరోనా ఉంది కాబట్టి సరిగ్గా అన్నీ చేయలేకపోతున్నామని ఎంత చెప్పుకున్నా పిండి కొద్దీ రొట్టె అన్న సామెత ఉండనే ఉంది. అలాగే ప్రాధాన్యతలు, అప్రాధాన్యతలు కూడా రాష్ట్ర పెద్దగా ఉండే వారు చూసుకోవాలి. ఆ ఆర్ధిక‌ సమతూల్యం లోపించడం వల్లనే వైసీపీ ఇపుడు చాలా వర్గాలకు దూరమైంది అంటున్నారు.

ముఖ్యంగా సంక్షేమ పధకాలు అంటున్నారు. అవి పెద్ద శాతం జనాభాగా ఉండ మధ్యతరగతి వర్గాలకు ఎటూ దక్కడంలేదు. ఇక దిగువ వర్గాలలో కూడా పధకాలు అందుతున్నా పన్నుల భారం మోత వారికి ఎలాగూ ఉంది. మరో వైపు చూస్తే వివిధ సామాజిక వర్గాలలో కూడా అనేక రూపాయలో వస్తున్న సమస్యల వల్ల తీవ్రమైన అసంతృప్తి ఉంది. వారు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీరు మీద గుర్రుగా ఉన్నారు.

వీటికి మించి అతి పెద్ద సెక్షన్ గా భావించే ప్రభుత్వ ఉద్యోగులు ఇపుడు సర్కార్ అంటేనే ఒక్క లెక్కన ఫైర్ అవుతున్నారు. ఈ మంట ఇప్పట్లో ఆగేది కాదు అని కూడా చెప్పాలి. ఇంత కధ జరిగాకా రేపటి రోజున ప్రభుత్వ తగ్గి వచ్చినా లేక ఇవ్వాల్సింది ఇచ్చినా కూడా వైసీపీ సర్కార్ మీద ప్రభుత్వ ఉద్యోగులకు ఒక స్టాండర్డ్ అభిప్రాయం ఏర్పడిపోయినట్లే అంటున్నారు.

ఆ సంగతి ఎటూ తెలుసు కాబట్టి వైసీపీ పెద్దలు కూడా తాము అనుకున్న దాన్నే చేసుకుంటూ పోతారు. అంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే ఏటా జీతాల రూపేణ 70 వేల కోట్ల దాకా ఖర్చు చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. దానికి మించి పైసా ఇచ్చినా తమకు అధిక భారమే అవుతుంది అని కూడా భావిస్తున్నారు. దీంతో 23 శాతం ఫిట్ మెంట్ కే కట్టుబడి ఉంటారు.

ఇక చంద్రబాబుకు ఇది వరంగానే ఉంటుందని అంతా అంటున్నారు. జగన్ ఒక పెద్ద గీత గీసేసి ఉంచారు. దాని మీద‌ ఒక చిన్న గీత గీసుకున్నా చాలు చంద్రబాబు ఉద్యోగులకు ఈ టైమ్ లో దేవుడే అయిపోతారు అంటున్నారు. ఏపీ ఆర్ధిక పరిస్థితి చంద్రబాబుకు కూడా తెలుసు. కాబట్టి ఆయన గతంలో మాదిరిగా 43 శాతం భారీ ఫిట్మెంట్ ఉద్యోగులకు ఇవ్వలేరని కూడా టీడీపీలో వినిపిస్తున్న మాట.

అంటే రేపటి రోజున చంద్రబాబు ఇంతకు మరో మూడు నాలుగు శాతం ఫిట్మెంట్ పెంచినా కూడా ఏపీ ఉద్యోగ వర్గాలు హ్యాపీ. అదే ఇపుడు జగన్ చేసినా కూడా ఆయన మీద పెట్టుకున్న హోప్స్ తో ఉద్యోగులకు చాలా తక్కువగానే కనిపిస్తుంది. పైగా ఈ టైమ్ లోతాము అలా కూడా చేయలేనని కూడా వైసీపీ పెద్దలు అంటున్నారు. సో ఇపుడు జగన్ తీసుకొచ్చిన ఈ బడ్జెట్ కటింగ్ కానీ హెచ్ ఆర్ ఏ కోతలు కానీ ఇతరత్రా వాయింపులు కానీ జగన్ని ఉద్యోగులకు పూర్తిగా దూరం చేసేవిగానే అంతా అంటున్నారు.

అదే టైమ్ లో జగన్ తెచ్చిన ఈ మార్పుచేర్పులు రేపటి రోజున వచ్చే సర్కార్ కి పూర్తిగా పూలబాట వేసినట్లుగా అవుతాయని కూడా విశ్లేషిస్తున్నారు. ఈ టైమ్ లో చంద్రబాబు సైలెంట్ గా ఉండడమే బెటర్ అన్న మాట కూడా సొంత పార్టీ నుంచి వినిపిస్తోంది. ఎన్నికలకు ముందు ఆయన ఎంతో కొంత ఫిట్మెంట్ పెంచుతానని హామీ ఇచ్చినా చాలు మండు వేసవిలో మల్లెపూల వానలా ఉద్యోగులకు ఉంటుందని చెబుతున్నారు. బాబు సైతం బంపర్ మెజారిటీతో నెగ్గేందుకు అది దోహదపడుతుంది అంటున్నారు. మొత్తానికి బాబుకు భలే మేలు జగన్ చేస్తున్నాడు అన్నదే ఇపుడు వినిపిస్తున్న అసలైన విశ్లేషణ.