Begin typing your search above and press return to search.

అటు జగన్ ఇటు పవన్ : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు...?

By:  Tupaki Desk   |   6 Jun 2022 11:49 AM GMT
అటు జగన్ ఇటు పవన్ : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు...?
X
చంద్రబాబు వ్యూహాలకు జోహార్ అనాల్సిందే. ఆయన ఏడు పదులు దాటిన వయసులో కూడా తన పదునెక్కిన వ్యూహాలతో ఏపీ పాలిటిక్స్ ని హీటెక్కించేస్తున్నారు. చంద్రబాబు స్టైల్ మార్చారు. అవును ఇపుడు కొత్త రూట్లో వస్తున్నారు. అవ్వా కావాలీ బువ్వా కావాలి అని బాబు కొత్త సాంగ్స్ పాడుతున్నారు. ఇంతకీ ఏపీ పాలిటిక్స్ లో బాబు మార్క్ ట్రిక్స్ ఏంటి ఆయన అమలు చేస్తున్న వ్యూహాలు ఏంటి అన్నది కనుక చూస్తే ప్రత్యర్ధుల బుర్ర తిరిగిపోవడం ఖాయం.

ఏపీలో జగన్ పూర్తిగా బీసీల ఓట్ల మీద ఆధారపడి రేపటి రాజకీయాలను చేయాలనుకుంటున్నారు. వారిని తన వైపునకు తిప్పుకోవాలని మంత్రిమండలి కూర్పు నుంచి నామినేటెడ్ పదవుల దాకా చాలానే ఇచ్చారు. ఇక సామాజిక న్యాయం భేరి పేరిట ఏపీలో తాజాగా సాగిన బస్సు యాత్ర జగన్ ఎన్నికల స్ట్రాటజీ ఏంటో చెప్పేసింది. దాంతో బీసీల ఓట్లను గంపగుత్తగా జగన్ కొల్లగొట్టాలని చూస్తున్నారు అన్నది టీడీపీ అధినాయకత్వానికి కరెక్ట్ గానే అర్ధమైంది.

దాంతో ఇపుడు బాబు ప్లాన్ మార్చేశారు. పవన్ని దగ్గర పెట్టుకుని ఆయనతో పొత్తులకు వెళ్తే కాపు ఓట్ల సంగతి బాగానే ఉన్నా బీసీలు దూరం కావడం ఖాయమని ఆయన బాగానే గ్రహించారు. అందుకే పవన్ తో పొత్తుల ఎత్తులకు కాస్తా దూరం పాటించారు అని అంటున్నారు. దానికి తోడు మునుపటి కంటే పెరిగిన ధీమా బాదుడే బాదుడుకు వచ్చిన బ్రహ్మాండమైన స్పందన, అదరహో అన్నట్లుగా సాగిన మహానాడు కార్యక్రమం బాబు లో ఫుల్ లెవెల్ లో కాన్ఫిడెన్స్ ని పెంచేశాయి అంటున్నారు.

ఈ నేపధ్యంలో పవన్ తో పొత్తు పెట్టుకుంటే కాపుల ఓట్లు కొన్ని ఇటు వైపు టర్న్ కావచ్చు. కానీ బీసీల పార్టీగా ఉన్న టీడీపీకి ఆ బ్రాండ్ చెదిరిపోతుంది. రేపటి రోజున కాపులు పవన్ తో బీసీలు జగన్ తో ఫిక్స్ అయిపోతే టీడీపీ టోటల్ సామాజిక చట్రానికే ఇరుసు లేకుండా పోతుంది. అందుకే బాబు తెలివైన ఎత్తుగడలో భాగంగానే వార్ వన్ సైడ్ అంటూ పవన్ ఇగోను హర్ట్ చేశారు అంటున్నారు.

ఫలితంగా ఇపుడు పవన్ తో పొత్తు కధ సస్పెన్స్ లో పడింది. ఎన్నికలకు దగ్గర చేసి ఈ పొత్తు కధను సుఖాంతం చేయాలో లేదా అన్న ఆప్షన్ బాబు చేతిలోనే ఎటూ ఉంది. మరో వైపు జనసేనతో పొత్తు లేకపోయినా గోదావరి జిల్లాలలో టీడీపీ కాపు ఓట్ల బేస్ కి పెద్దగా ప్రమాదం లేదు. 2019 నాటి ఫలితాలు అయితే వచ్చే సీనే లేదు, ఎందుకంటే వైసీపీ యాంటీ ఇంకెంబెన్సీ ఓట్లు కొత్తగా వచ్చి యాడ్ అవుతాయి.

ఇక బీసీలు కూడా టీడీపీ పట్ల అభిమానించే వారు కంటిన్యూ అయ్యే చాన్స్ ఉంటుంది. రేపటి రోజున టీడీపీయే అధికారంలోకి వస్తుంది అన్న సంకేతాలు ఉంటే మునుపటి మాదిరిగా పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చినా ఆశ్చర్యం లేదు. ఆ విధంగా జగన్ కి బీసీ దెబ్బ పడిపోతుంది. బీసీ పార్టీగా టీడీపీ తన బ్రాండ్ ని నిలబెట్టుకుంటుంది.

ఇక పొత్తుల విషయంలో తాము బేఫికర్ గా ఉన్నామన్న సంకేతాన్ని జనసేనలో పంపించడం ద్వారా అటు నుంచే నరుక్కురావాలన్న వ్యూహమూ ఉంది. ఎన్నికల వేళకు కూడా జనసేన పుంజుకోకపోయినా పార్టీ పటిష్టం చేసుకోకపోయినా టీడీపీతో పొత్తులకు ఆ పార్టీ చేతులు చాచడం ఖాయం. అపుడు తాను కోరుకున్నట్లుగా సీట్లు ఇచ్చి తమ మిత్రుడిని చేసుకోవచ్చు. ఈ మొత్తం రాజకీయ వ్యూహాన్ని చూసినపుడు అటు జగన్ కి పూర్తి స్థాయిలో బీసీల మద్దతు దక్కకుండా ఇటు పవన్ కి కాపులలో విశ్వాసం పెరగకుండా బాబు వేసిన మాస్టర్ ప్లాన్ అని అర్ధమవుతోంది. మొత్తానికి బాబు మార్క్ పాలిటిక్స్ కి అటు జగన్ ఇటు పవన్ బిగ్ ట్రబుల్స్ లో పడతారా అంటే వెయిట్ అండ్ సీ.